న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wasim Jaffer: రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపరో సూపర్!

Wasim Jaffer Lauds Rohit Sharma’s Captaincy In First Test

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ సారథ్యాన్ని జట్టులోని ఆటగాళ్లంతా కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నారని చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఫస్ట్ టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకున్నాడు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో విఫలమైన కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడని వసీం జాఫర్ కొనియాడాడు.

రోహిత్ కెప్టెన్సీ సూపర్..

రోహిత్ కెప్టెన్సీ సూపర్..

కెప్టెన్‌గా అతని నిర్ణయాలు స్పాట్ ఆన్ ఉన్నాయన్నాడు. తుది జట్టులో హనుమ విహారీని తీసుకోవడం.. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించడం వంటి కీలక నిర్ణయాలు జట్టుకు విజయాన్నందించాయని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో అభిప్రాయపడ్డాడు. ‘సుదీర్ఘ కాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సత్తా చాటాడు.

కెప్టెన్సీతో అతను సౌకర్యంగా ఉన్నాడు. జట్టులోని ఆటగాళ్లు కూడా రోహిత్ కెప్టెన్సీతో సౌకర్యంగా ఉన్నట్లున్నారు. ఆటగాళ్లకు అతను చాలా స్వేచ్చను ఇస్తున్నాడు. మైదానంలో ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పులు స్పాటాన్‌గా ఉన్నాయి. విహారికి అవకాశం ఇచ్చి కెప్టెన్‌గా తన పనితనం చూపెట్టుకున్నాడు.

ఐ లైక్ ఇట్..

ఐ లైక్ ఇట్..

అతని సారథ్యం నాకు బాగా నచ్చింది. మ్యాచ్‌ను మరింత సాగనివ్వకుండా శ్రీలంకను ఫాలో ఆన్‌కు ఆహ్వానించి సరైన నిర్ణయం తీసుకున్నాడు. దాంతో మ్యాచ్ మూడూ రోజుల్లోనే ముగిసింది. అతని కెప్టెన్సీ తీరు సానుకూలంగా ఉంది. భారత శిభిరంలోని చిరునవ్వులను చూడటం చూడ ముచ్చటగా ఉంది.'అని జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రవీంద్ర జడేజాను కూడా వసీం జాఫర్ కొనియాడాడు. చాలా సార్లు తన బ్యాటింగ్‌తో జడేజా భారత జట్టును గెలిపించాడని, అతను బీసీసీఐ కాంట్రాక్టుల్లో A+ కేటగిరీకి ఆర్హుడని చెప్పుకొచ్చాడు.

IND vs SL : Rohit Sharma’s Reaction After Virat Kohli’s Dismissal | Oneindia Telugu
శ్రీలంక చిత్తు..

శ్రీలంక చిత్తు..

తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైన లంక.. ఫాలోఆన్‌లో 60 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో నిశాంక (61 నాటౌట్‌; 133 బంతుల్లో 11×4), ఫాలోఆన్‌లో డిక్వెలా (51 నాటౌట్‌; 81 బంతుల్లో 9×4) కాస్త పోరాడారు. ఈ మ్యాచ్‌ సహా మొహాలిలో వరుసగా ఆడిన మూడు టెస్టుల్లోనూ జడ్డూనే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలవడం విశేషం. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు (డేనైట్‌) శనివారం నుంచి బెంగళూరులో జరుగుతుంది.

Story first published: Monday, March 7, 2022, 16:13 [IST]
Other articles published on Mar 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X