న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wasim Jaffer: ఢిల్లీ గెలవాల్సిన మ్యాచ్.. హార్దిక్ పాండ్యా సూపర్ కెప్టెన్సీతోనే గుజరాత్‌‌కు విజయం!

Wasim Jaffer lauds Hardik Pandya captaincy against Delhi Capitals

న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ కెప్టెన్సీ ఆకట్టుకుందని తెలిపాడు. ఢిల్లీ సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను హార్దిక్ తన అద్భుత కెప్టెన్సీతో గుజరాత్‌కు విజయాన్నందించాడని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్‌ టైటాన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

దాంతో ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన వసీం జాఫర్‌.. గుజరాత్ విజయానికి గల కారణాలను వెల్లడించాడు. తాను ఢిల్లీ గెలవాలని ఆశించినా హార్దిక్ కెప్టెన్సీ, ఫెర్గూసన్‌ బౌలింగ్‌ తనను ఆకట్టుకున్నాయని చెప్పాడు.

ఢిల్లీ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్..

ఢిల్లీ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్..

'ఇది ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్‌. గుజరాత్‌ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రిషభ్‌ పంత్‌ టీమ్‌ ఛేదించాలని అనుకున్నా. ఆ పిచ్‌పై ఇదేం పెద్ద లక్ష్యం కాదు. అలాగే పంత్‌, లలిత్‌ యాదవ్‌ ఉన్నంతవరకూ ఢిల్లీ జట్టు మంచి స్థితిలోనే కొనసాగింది. సడెన్‌గా లలిత్‌ రనౌటవ్వడంతో మ్యాచ్‌ గమనం మారిపోయింది. ఫెర్గూసన్‌ కూడా ఎంతో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కీలక సమయంలో అతను.. పంత్‌, అక్షర్‌పటేల్‌ లాంటి కీలక వికెట్లు సాధించాడు. వాళ్లిద్దరూ గత మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించారు.

పాండ్యా కెప్టెన్సీ సూపర్..

పాండ్యా కెప్టెన్సీ సూపర్..

దీన్నిబట్టి చూస్తే.. బలమైన బౌలింగ్‌ యూనిట్‌ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. రషీద్‌, షమీ, ఫెర్గూసన్‌ ముగ్గురూ గుజరాత్‌లో అత్యుత్తమ బౌలర్లు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి పాండ్య వద్ద నలుగురు స్పెషలిస్టు బౌలర్లు మిగిలి ఉన్నారు. ఇక్కడ ఒక్క ఓవర్‌ సమన్వయం చేసుకోవాల్సి ఉన్నా పాండ్య తన బౌలర్లపై నమ్మకం ఉంచాడు. వాళ్లని రొటేట్‌ చేసిన విధానం గొప్పగా ఉంది. అతడి కెప్టెన్సీ ఆకట్టుకుంది' అని జాఫర్‌ మెచ్చుకున్నాడు.

పాండ్యా ఫిట్..

పాండ్యా ఫిట్..

మరోవైపు పలువురు గుజరాత్‌ అభిమనులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు విజయాలు సాధించడంతో పాండ్య కెప్టెన్సీని కొనియాడుతున్నారు. ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం హార్దిక్ పాండ్యాకు ఇదే తొలిసారి. దేశవాళీ క్రికెట్‌లో కూడా అతను పెద్దగా కెప్టెన్సీ చేయలేదు. గత సీజన్ వరకు ముంబైకి ఆడిన అతను ఈ సీజన్ మెగా వేలం ముందు గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. ఫిట్ నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన అతను ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్‌గా సత్తా చాటుతున్నాడు.

Story first published: Sunday, April 3, 2022, 17:06 [IST]
Other articles published on Apr 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X