న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిషేధం తర్వాత బరిలోకి స్మిత్‌, వార్నర్‌.. కివీస్‌పై ఆసీస్‌ గెలుపు

ICC Cricket World Cup 2019 : David Warner, Steve Smith Return As Aussies Win Tight World Cup Warm Up
Warner, Smith return as Aussies win tight World Cup warm up

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌లు ఆసీస్ తరపున మైదానంలోకి దిగారు. ప్రపంచకప్‌ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆసీస్ జట్టులో పునరాగమనం చేశారు.

కౌల్టర్‌ నైల్‌ సూపర్ ఇన్నింగ్స్:

కౌల్టర్‌ నైల్‌ సూపర్ ఇన్నింగ్స్:

ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ 46.1 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ఖవాజా (4) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్‌ ఫించ్‌ (52), వార్నర్‌ (39)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. వార్నర్‌ పెవిలియన్ చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌ (22) పర్వాలేదనిపించాడు. స్మిత్‌ నిష్క్రమించాక ఆసీస్‌ స్వల్ప వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో పేస్ బౌలర్ కౌల్టర్‌ నైల్‌ (34) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో.. ఆసీస్ 48.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

స్మిత్ వన్ హ్యాండ్ క్యాచ్:

స్మిత్ వన్ హ్యాండ్ క్యాచ్:

కివీస్ బ్యాటింగ్ చేసే సమయంలో స్మిత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. పేసర్ జేసన్ బెండ్రాఫ్ వేసిన బంతిని కివీస్ బ్యాట్స్‌మన్‌ టామ్ లాతమ్ లెగ్ సైడ్ ఫ్లిప్ చేసాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ ఒక్కసారిగా దూసుకొచ్చి డైవ్ చేస్తూ వన్ హ్యాండ్ తో క్యాచ్ పట్టాడు. దీంతో టామ్ లాతమ్ నిరాశగా పెవిలియన్ చేరగా.. ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఐపీఎల్‌లో అదరగొట్టిన వార్నర్:

ఐపీఎల్‌లో అదరగొట్టిన వార్నర్:

బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు ఆటకు దూరమైన స్టీవ్ స్మిత్ తాజాగా ఆసీస్ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. వార్నర్, స్మిత్ ఏడాది తర్వాత ఆసీస్ జట్టుతో కలవడం ఇదే తొలిసారి. నిషేదానికి ముందు బిగ్ బాష్ లీగ్‌లో ఈ ఇద్దరు ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్-12లో వార్నర్ పరుగుల వరద పారించగా.. స్మిత్ మోస్తరుగా రాణించాడు. అయితే రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవరించిన మ్యాచ్‌లలో మాత్రం స్మిత్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు.

Story first published: Tuesday, May 7, 2019, 10:51 [IST]
Other articles published on May 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X