న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఖాతాలో రెండు చెత్త రికార్డులు: విశాఖ వన్డే అడ్డుకునేనా?

Vizag ODI: India look to avoid 2nd consecutive bilateral ODI series defeat at home

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నై వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. తొలి వన్డేలో విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా ఒత్తిడితో బరిలోకి దిగనుంది. సిరిస్‌లో ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి.

ఈ నేపథ్యంలో విశాఖ వన్డేలో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వెస్టిండిస్ ఉంది. ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా ఓడితే 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు వెస్టిండిస్ జట్టు తెరదించుతుంది.

<strong>ఆసలు కారణమిదీ: విశాఖ వన్డేలో విండిస్ ఆటగాళ్ల చేతికి నల్ల బ్యాడ్జిలు</strong>ఆసలు కారణమిదీ: విశాఖ వన్డేలో విండిస్ ఆటగాళ్ల చేతికి నల్ల బ్యాడ్జిలు

13 ఏళ్ల క్రితం టీమిండియాపై

13 ఏళ్ల క్రితం టీమిండియాపై

13 ఏళ్ల క్రితం టీమిండియాపై వెస్టిండిస్ జట్టు వన్డే సిరిస్‌ను నెగ్గింది. 1979 తర్వాత నుంచి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 131 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో వెస్టిండిస్ 63 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 20006 తర్వాత నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్‌ల్లో టీమిండియాదే పైచేయి.

రెండో వన్డేకి ఆతిథ్యమిస్తోన్న విశాఖ

రెండో వన్డేకి ఆతిథ్యమిస్తోన్న విశాఖ

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా రెండో వన్డేకి ఆతిథ్యమిస్తోన్న విశాఖపట్నం స్టేడియంలో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. అంతేకాదు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వరుసగా రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోయింది. 2002-2003లో వెస్టిండిస్‌తో జరిగిన 7 మ్యాచ్‌ల సిరిస్‌లో ఓడిపోగా... ఆ తర్వాత 2004-05లో పాకిస్థాన్‌తో వన్డే సిరిస్‌ను కోల్పోయింది.

మళ్లీ ఇన్నాళ్లకు

మళ్లీ ఇన్నాళ్లకు

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా వరుసగా రెండు వన్డే సిరిస్‌ల్లో ఓడిపోయే అవకాశం వచ్చింది. విశాఖ వన్డేలో టీమిండియా ఓడితే వరుసగా సొంతగడ్డపై ఐదు వన్డేలు ఓడిన చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో పాటు సొంతగడ్డపై వరుసగా రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోయిన జట్టుగా కూడా నిలుస్తుంది.

తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం

తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం

విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది. ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్‌ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది.

ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది.

గత ఆరు వన్డేల్లో

గత ఆరు వన్డేల్లో

ఈ స్టేడియంలో జరిగిన గత ఆరు వన్డేల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు కేవలం ఒక్కసారే మాత్రమే విజయం సాధించింది. విశాఖ పిచ్‌పై స్పిన్నర్లు రాణించే అవకాశం ఉంది. చివరగా ఈ పిచ్‌పై జరిగిన వన్డేలో (భారత్‌, విండీస్‌ మధ్య) ఏకంగా 642 పరుగులు నమోదయ్యాయి. దీంతో టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గుచూపే అవకాశం ఉంది.

Story first published: Wednesday, December 18, 2019, 12:20 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X