న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రామమందిరానికి లైన్ క్లియర్: అయోధ్య తీర్పుపై ట్విట్టర్‌లో వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag takes to Twitter after SC announces judgement in Ayodhya land case

హైదరాబాద్: అయోధ్యలో రామమందిరానికి లైన్ క్లియర్ అయింది. యావత్‌ భారత దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అత్యంత సున్నితమైన అయోధ్య రామజన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై సుప్రీం కోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏకగ్రీవ తీర్పునిచ్చింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.

గేల్, అఫ్రిదిలను అందుకునేనా?: ప్రపంచ క్రికెట్‌లో భారత్ నుంచి ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మగేల్, అఫ్రిదిలను అందుకునేనా?: ప్రపంచ క్రికెట్‌లో భారత్ నుంచి ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ

స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేవిధంగా ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: యూసఫ్‌ పఠాన్‌ స్టన్నింగ్ క్యాచ్ చూశారా? (వీడియో)సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: యూసఫ్‌ పఠాన్‌ స్టన్నింగ్ క్యాచ్ చూశారా? (వీడియో)

నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నమ్మకం, విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తెలిపారు.

సుప్రీం తీర్పు ప్రకటించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో "శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్" అంటూ కామెంట్ పెట్టి శ్రీరాముడి చిత్రాన్ని పంచుకున్నారు.

Story first published: Saturday, November 9, 2019, 13:29 [IST]
Other articles published on Nov 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X