
సందిగ్ధత సమయంలో తర్వాతి కెప్టెన్‌గా
చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి కెప్టెన్‌గా ఎవరిని చేస్తుందనే విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతున్న తరుణంలో ఈ విషయమై భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడడు. ధోనీ తర్వాత కెప్టెన్సీని చేపట్టేందుకు ఎవరు సరైన వ్యక్తో గుర్తించాడు. జడేజా ఇప్పటికే చేతులెత్తిసినందున.. చెన్నై కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాలని సెహ్వాగ్ సూచించాడు. గైక్వాడ్‌కు మంచి కెప్టెన్‌గా ఉండేందుకు అన్ని లక్షణాలు ఉన్నాయని, మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం వల్ల అతనికి కెప్టెన్సీపై అనుభవం ఉందని పేర్కొన్నాడు.

సెంచరీ చేసినా, డకౌట్ అయినా సేమ్ రియాక్షనే ఉంటది
ఈ విషయమై సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. 'రుతురాజ్ మహారాష్ట్ర టీంకు కెప్టెన్‌గా ఉన్నాడు. చాలా సైలెంట్‌గా ఆడుతాడు. సెంచరీ చేసినా గర్వమనే మ్యానరిజమ్ అతనిలో కనిపించదు. 0 చేసినా అదే తీరులో వ్యవహరిస్తాడు. అతడి ముఖంలో మ్యాచ్ పట్ల వైఖరి స్పష్టంగా ఉంటుంది. సెంచరీ చేసినందుకు సంతోషించినా లేదా డకౌట్ అయినందుకు బాధపడినా అతను పూర్తి కంట్రోల్లో ఉంటాడు. ప్రశాంతంగా వ్యవహరిస్తాడగు. మంచి కెప్టెన్‌గా ఉండేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి అతనికి ఒక ఆలోచన ఉంది. మ్యాచ్‌ని ఎలా నిర్దేశించాలో ఏ టైంలో ఎవరికి బంతి ఇవ్వాలో, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పు తీసుకురావాలో అనే ఆలోచనలు అతనికి ఉంటాయి.' అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు.

గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు
ఐపీఎల్ 2022 సీజన్లో ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్‌కు ఇది మూడో సీజన్. ఇప్పటివరకు 12మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 26.08 సగటుతో 313పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2020లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గైక్వాడ్‌కి తక్కువ అవకాశాలొచ్చాయి. అయితే అతను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 204పరుగులు చేశాడు. గైక్వాడ్ ఐపీఎల్ 2021లో భీకరంగా చెలరేగాడు. ఆ సీజన్లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. మొత్తం 635 పరుగులు చేసి సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని అత్యుత్తమ ఫామ్ కారణంగా.. ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు చెన్నై తన నాలుగు రిటెన్షన్‌లలో గైక్వాడ్‌ను కూడా ఉంచుకుంది.

అచ్చం ధోనీలాగే లక్షణాలున్నాయి
సెహ్వాగ్ రుతురాజ్ గైక్వాడ్‌ను ధోనీతో పోల్చాడు. అతని లక్షణాలు చాలా వరకు ధోనీ వలె ఉన్నాయని కూడా చెప్పాడు. రుతురాజ్ గైక్వాడ్ 3-4 సీజన్లు ఆడితే అతను ఎంఎస్ ధోనీ తర్వాత దీర్ఘకాలిక కెప్టెన్‌గా చెన్నైకి కావడానికి అన్ని అర్హతలున్నాయి. ఎంఎస్ ధోనిని ప్రపంచం ఎందుకు మంచి కెప్టెన్‌గా భావిస్తుంది? ఎందుకంటే అతను కూల్‌గా ఉన్నాడు. తన సొంత నిర్ణయాలే తీసుకుంటాడు. అతను బౌలర్లను, బ్యాటర్లను సమర్థంగా ఉపయోగించుకుంటాడు. అతనికి లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ధైర్యం ఉన్నవారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ధోనీ ధైర్యవంతమైన కెప్టెన్. సేమ్ ధోనీ లాగే రుతురాజ్ గైక్వాడ్‌కు అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కటి తప్ప. అది లక్ ఫ్యాక్టర్. రుతురాజ్‌కు లక్ ఫ్యాక్టర్ ఉందో లేదో మాత్రం చెప్పలేను' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.