న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: పొలార్డ్‌.. టేక్ ఏ బో! పోలి కాకా బంతిని వెంటాడి మరీ కొట్టాడు! గొప్ప హిట్టింగ్‌ ఇదే!

Virender Sehwag, Harsha Bhogle and Yuvraj Singh praises Kieron Pollard for match winning Knock

ఢిల్లీ: శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 219 పరుగుల టార్గెట్‌ ఇచ్చిన తర్వాత మ్యాచ్‌ ఫలితం ముందే డిసైడ్‌ అయిపోయిందనుకున్నారంతా. ముంబై బ్యాట్స్‌మెన్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి ఇంత టార్గెట్‌ ఛేదించలేదనుకున్నారు. మరి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో దిగిన ముంబై ఐదుసార్లు ట్రోఫీని ఎలా గెలిచిందో సీఎస్‌కేతో​ మ్యాచ్‌ను బట్టి అర్థమవుతోంది. ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ అంతా భారీ హిట్టర్లతో ఉంది. విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్‌ (34 బంతుల్లో 87; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌తో ముంబైకి ఊహించని విజయాన్ని అందుకుంది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, హర్ష భోగ్లే, యువరాజ్ సింగ్, హర్భజన్‌ సింగ్‌ తమదైన శైలిలో కీరన్ పొలార్డ్‌పై ప్రశంసలు కురిపించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం బాగా పోరాడిందని ట్వీట్లు చేశారు. 'నిజం చెప్పాలంటే.. చెన్నై, ముంబై రెండూ ఛాంపియన్‌ జట్లే. ఏదేమైనా ఈ మ్యాచ్‌ చూసేందుకు చాలా బాగుంది. కీరన్ పొలార్డ్‌ నీకు పెద్ద వందనం. ఎంతైనా ముంబై గొప్ప జట్టు' అని దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ పేర్కొన్నాడు.

RR vs SRH: వార్నర్‌పై వేటు.. మూడు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్‌! రాజస్థాన్‌దే బ్యాటింగ్!RR vs SRH: వార్నర్‌పై వేటు.. మూడు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్‌! రాజస్థాన్‌దే బ్యాటింగ్!

'ఆహా ఏం మ్యాచ్‌ ఇది. కీరన్‌ పొలార్డ్‌ నువ్వో అద్భుతం. అంబటి రాయుడిదీ గొప్ప ఇన్నింగ్సే' అని సిక్సర్ల సింగ్ యువరాజ్‌ సింగ్‌ ట్వీట్ చేశాడు. 'రోహిత్ సేనకు తిరుగులేదు. ముంబై పల్టాన్స్‌కు ఇది అలవాటే. కీరన్‌ పొలార్డ్‌ సూపర్‌. అద్భుత ఇన్నింగ్స్ ఆడావ్' అని ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే అన్నాడు. 'పోలి కాకా నుంచి అద్భుతమైన హిట్టింగ్‌. నిజంగా విధ్వంసమే. బంతిని వెంటాడి వెంటాడి మరీ కొట్టాడు. సూపర్ మ్యాచ్' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీటాడు.

'వావ్‌! ఏం జరిగిందో చెప్పేందుకు మాటల్లేవ్‌! ఇలాంటి మ్యాచ్‌ చూస్తాననుకోలేదు. కీరన్‌ పొలార్డ్‌ అద్భుత ఇన్నింగ్స్‌. ఐపీఎల్‌లో నేను చూసిన గొప్ప హిట్టింగ్‌ ఇదే. ముంబైకి కుడోస్‌. చెన్నై చివరి వరకూ పోరాడింది. ఇదో గొప్ప మ్యాచ్‌' అని టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. 'నిజంగా అద్భుతమైన క్రికెట్‌ ఇది. పొడగరి కీరన్‌ పొలార్డ్‌ తనదైన రీతిలో గెలిపించాడు. ముంబై పల్టాన్స్‌ వెల్‌డన్‌. అంబటి రాయుడూ.. సూపర్‌ ఇన్నింగ్స్‌ మచ్చా! సామ్‌ కరన్‌ బౌలింగ్‌ బాగుంది' అని వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ పొగిడాడు.

34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కీరన్‌ పొలార్డ్‌.. ఆఖరి ఓవర్‌లో కొట్టిన ఒక ఫోర్‌ సీఎస్‌కే ఆటగాళ్లు అసలు ఊహించి ఉండరు. ఆఖరి ఓవర్‌ రెండో బంతిని ఎన్‌గిడి కాళ్ల మధ్యలో ఫెర్‌ఫెక్ట్‌ యార్కర్‌ వేశాడు. దాదాపు 140 కి.మీ వేగంతో వచ్చిన ఆ బంతి మిస్సయితే పొలార్డ్‌ బౌల్డ్‌ కావాల్సిందే. మరి పొలార్డ్‌ ఆ బంతి యార్కర్‌ పడటమే తరువాయి ఒక లెగ్‌ను కాస్త ఎడంగా తీసుకుని స్క్వేర్‌ లెగ్‌ మీదుగా ఫోర్‌ కొట్టాడు. ఆ బంతిని ఫోర్‌ కొట్టడంతో ధోనితో సహా ఎన్‌గిడి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు.

Story first published: Sunday, May 2, 2021, 16:00 [IST]
Other articles published on May 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X