న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘Scrappy Start’: సీఎస్‌కే చేతిలో చిత్తుగా ఓడటంపై విరాట్ కోహ్లీ

Virat Kohli upbeat despite a ‘scrappy start’

హైదరాబాద్: సీఎస్‌కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో తమ ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. చెపాక్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఎవరూ ఇలా ఆరంభించాలనుకోరు. కానీ మా పోరాటం సంతోషాన్నిచ్చింది. అతి స్వల్ప స్కోర్‌ను కాపాడుకుంటూ మ్యాచ్‌ను 18వ ఓవర్‌ వరకు తీసుకెళ్లడం ఆకట్టుకుంది" అని అన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పిచ్‌ను చూసినప్పుడు 140 లేదా 150 పరుగులు

పిచ్‌ను చూసినప్పుడు 140 లేదా 150 పరుగులు

"మా బ్యాటింగ్‌ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ పిచ్‌ను చూసినప్పుడు 140 లేదా 150 పరుగులు చేసేలా అనిపించిందని, ఆడితే కానీ వికెట్‌ నెమ్మదిగా ఉందని తెలియలేదు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ అంత తేలిక కాదని, సీజన్‌ మొదట్లోనే ఇలాంటి పిచ్‌పై ఆడటం మంచిది" అని కోహ్లీ అన్నాడు.

మ్యాచ్‌లో నిలవాలనే ప్రయత్నించాం

మ్యాచ్‌లో నిలవాలనే ప్రయత్నించాం

"ఎలాగైనా మ్యాచ్‌లో నిలవాలనే ప్రయత్నించామని, 18 ఓవర్ల వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లాం. ఏది అయితేనేం లీగ్‌ను చాలా చెత్తగా ఆరంభించాం. ఈ ఓటమి నుంచి జట్టు తేరుకుంటుందా? లేదా? అని ఆలోచించడం లేదు. గత నాలుగు రోజులగా ఈ పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. ఏది ఏమైనప్పటికీ మేం బ్యాటింగ్‌ బాగా చేయాల్సింది" అని కోహ్లీ తెలిపాడు.

120 పరుగులు చేసుంటే పోరాడే వీలుండేది

120 పరుగులు చేసుంటే పోరాడే వీలుండేది

"తమ బ్యాట్స్‌మెన్‌ మంచి పరుగులు చేస్తే బాగుండేదని, 120 పరుగులు చేసుంటే పోరాడే వీలుండేది. మా పేసర్‌ నవదీప్‌ షైనీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సీఎస్‌కే మా కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వారు ఈ విజయానికి అర్హులు. కానీ మా జట్టు పోరాట స్పూర్తి ఆకట్టుకుంది" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

భజ్జీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు

భజ్జీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్‌ పటేల్‌ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఒక్కడే ఫరవాలేదనిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో హర్భజన్, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో 3 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. అనంతరం చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 71 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. భజ్జీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Sunday, March 24, 2019, 15:18 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X