న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీ పాఠాలు ఎవరి వద్ద నుంచి నేర్చుకున్నానంటే!: విజ్డెన్‌ క్రికెట్ ఇంటర్యూలో కోహ్లీ

Virat Kohli says observing MS Dhoni from slips helped him evolve as captain

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీ నుంచి సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య అనుష్క శర్మతో కలిసి తనకు లభించిన విరామాన్ని కోహ్లీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా విజ్డెన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై కోహ్లీ స్పందించాడు.

'Born Great or Made' Survey On Virat Kohli

<strong>పాక్‌తో పోలిస్తే కెమెరామెన్ బాగా ఆడాడు: భారత్-పాక్ మ్యాచ్‌పై ఓ నెటిజన్ ట్వీట్</strong>పాక్‌తో పోలిస్తే కెమెరామెన్ బాగా ఆడాడు: భారత్-పాక్ మ్యాచ్‌పై ఓ నెటిజన్ ట్వీట్

తాను కేవలం ధోని నుంచి మాత్రమే కెప్టెన్సీ నేర్చుకున్నానని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు. "ధోని కంటే ముందు ఎవరి నుంచీ కెప్టెన్సీ నేర్చుకోలేదు.. ధోనికి చాలా దగ్గరగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని నుంచి చాలా నేర్చుకున్నాను. నేను వైస్‌కెప్టెన్ కాక ముందు నుంచీ ధోనీకి నాకు తోచిన సలహాలు ఇస్తుండేవాడిని" అని కోహ్లీ చెప్పాడు.

లక్ష్యాలు చేధించడాన్ని ఎంజాయ్ చేస్తా

లక్ష్యాలు చేధించడాన్ని ఎంజాయ్ చేస్తా

"గేమ్ గురించి ఆలోచించడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తా. కెప్టెన్సీని ఎలాగైతే ఎంజాయ్ చేస్తానో అదేవిధంగా లక్ష్యాన్ని చేధించడంలో కూడా. మైదానంలో గేమ్ మధ్యలో మ్యాచ్ గెలుపు కోసం నా మెదడుకి పదను పెడతా. ఈ విషయాన్ని ధోని నుంచే నేర్చుకున్నా" అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇక, క్రికెట్ అంటే టెస్టు ఫార్మాటే అని కోహ్లీ స్పష్టం చేశాడు.

టెస్టు క్రికెట్‌లో సంతృప్తి ఉంటుంది

టెస్టు క్రికెట్‌లో సంతృప్తి ఉంటుంది

ఈ ఫార్మాట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించే ప్రతిపాదనను కూడా కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్ బాగా ఆడితే దక్కే సంతృప్తి మరే ఇతర ఫార్మాట్‌లో ఉండదని ఈ సందర్భంగా కోహ్లీ వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ ఎక్కడికీ పోదని, అలాగే దానిని కుదించడం కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పాడు.

కొన్ని దేశాల్లో టెస్టు క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం

కొన్ని దేశాల్లో టెస్టు క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం

టీ20ల సంఖ్య పెరిగి పోతుండటం కొన్ని దేశాల్లో టెస్టు క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని కోహ్లీ అన్నాడు. అయితే సరైన అవగాహన ఉంటే టెస్టు క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ "దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లాంటి దేశాల్లో చూడండి, టెస్టులకు భారీగా ప్రేక్షకులు వస్తారు. ఎందుకంటే అక్కడి జనాలకు గేమ్‌పై మంచి అవగాహన ఉంది" అని కోహ్లి చెప్పాడు.

ఐదు రోజుల క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది

ఐదు రోజుల క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది

ఇక టెస్టు ఛాంపియన్‌షిప్ రావడం కచ్చితంగా ఐదు రోజుల క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ నుంచి సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో త్వరలో వెస్టిండిస్‌తో భారత్ వేదికగా జరిగే సిరిస్‌కు అందుబాటులోకి రానున్నాడు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

Story first published: Tuesday, September 25, 2018, 15:06 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X