న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి: ఆటగాళ్లకు కోహ్లీ హెచ్చరిక

Virat Kohli

హైదరాబాద్: వరల్డ్‌కప్ జట్టు రేసులో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెడు అలవాట్లు చేసుకోవద్దని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ హెచ్చరించాడు. ముఖ్యంగా పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించుకోవాలని ఆస్ట్రేలియాతో తొలి టీ20కి ముందు విలేకరులతో నిర్వహించిన సమావేశంలో కోహ్లీ అన్నాడు. "ఆటగాళ్లు వన్డే తరహా ఆటశైలి, సాంకేతికత, ప్రాథమిక అంశాలకు దూరం కావొద్దు. ఐపీఎల్‌లో చేసుకొనే చెడు అలవాట్లు ఆటతీరు దెబ్బతీసే అవకాశం ఉంది. సహచరులు తమ ఆటతీరుపై ఓ కన్నేసి ఉంచాలి. లీగ్‌ సమయంలో నెట్స్‌లోకి వెళ్లి అనవసర షాట్లు ప్రయత్నించి చెడు అలవాట్లు చేసుకుంటే బ్యాటింగ్ ఫామ్‌ పోతుంది" అని కోహ్లీ సూచించాడు.

వరల్డ్‌కప్‌లో ఫామ్‌లోకి రావడం కష్టం

వరల్డ్‌కప్‌లో ఫామ్‌లోకి రావడం కష్టం

"దీంతో వరల్డ్‌కప్‌లో ఫామ్‌లోకి రావడం కష్టం అవుతుంది. ఐపీఎల్‌‌లో మీ జట్లు మంచి స్థానంలో ఉంటే 2, 3 మ్యాచ్‌లు విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు. ఆటగాళ్లు తమ శరీరం, అలసట గురించి నిజాయతీగా వ్యవహరించాలి. మీకు ఎన్ని ప్రాక్టీస్‌ సెషన్లు అవసరమో గుర్తించాలి. అనవసరంగా రెండు మూడు గంటలు నెట్స్‌లో గడపొద్దు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి" అని కోహ్లీ అన్నాడు.

మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 2019వ సీజన్‌ ఆరంభం

మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 2019వ సీజన్‌ ఆరంభం

ఈ ఏడాది మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 2019వ సీజన్‌ ఆరంభం కానుంది. ఇటీవలే ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.

తొలి రెండు వారాల షెడ్యూల్‌ మాత్రమే

తొలి రెండు వారాల షెడ్యూల్‌ మాత్రమే

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ ట్విట‌ర్‌లో ఉంచారు. ఐపీఎల్ ముగిసిన 12 రోజుల్లోనే వరల్డ్‌కప్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఈ సూచనలు చేశాడు.

Story first published: Sunday, February 24, 2019, 20:01 [IST]
Other articles published on Feb 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X