న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణమిదే: సిడ్నీ టెస్టులో పింక్ గ్లోవ్స్, పింక్ బ్యాట్‌తో కోహ్లీ (ఫోటోలు)

India vs Australia 4 Test : Virat Kohli’s Bat And Gloves Turn Pink During Ind Vs Aus 4th Test At SCG
Virat Kohli’s Bat and Gloves Turn Pink for Breast Cancer Awareness During Ind vs Aus 4th Test at SCG

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్ గ్లోవ్స్, బ్యాట్‌కు పింక్ ఎమ్మారెఫ్ స్టికర్‌తో బ్యాటింగ్‌కు క్రీజులోకి వచ్చాడు.

<strong>IND vs AUS 4th Test: ముగిసిన తొలిరోజు, పుజారా సెంచరీ, భారత్ 303/4</strong>IND vs AUS 4th Test: ముగిసిన తొలిరోజు, పుజారా సెంచరీ, భారత్ 303/4

అయితే, ఎప్పుడూ లేనిది విరాట్ కోహ్లీ ఇలా పింక్ కలర్‌లో కనిపించాడు ఏంటని అభిమానులు చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉంది. ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ తన భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతుగా సిడ్నీ ఇలా పింక్ టెస్ట్ నిర్వహిస్తోంది.

2009 నుంచి ప్రతి ఏటా

2009 నుంచి ప్రతి ఏటా సిడ్నీలో ఇలా పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌కు వాడే స్టంప్స్, బౌండరీ లైన్స్ అన్నీ పింక్ కలర్‌లోనే ఉండటం విశేషం. సిడ్నీ టెస్టుకు ముందు ఆతిథ్య జట్టులోని ఆటగాళ్లు కూడా తమ బ్యాగీ పింక్ కలర్ క్యాప్‌లతో ఫొటోలు దిగారు.

విరాట్ కోహ్లీ సైతం తన వంతుగా

ఈ మంచి కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తన వంతుగా పింక్ గ్లోవ్స్, పింక్ బ్యాట్‌తో వచ్చి మద్దతు తెలిపాడు. మెక్‌గ్రాత్ భార్య జేన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థమే ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్యాన్సర్‌పై పోరాడుతున్నాడు మెక్‌గ్రాత్. ఈ పింక్ టెస్ట్ ద్వారా వచ్చిన డబ్బంతా మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కే వెళ్తుంది.

23 పరుగులు చేసిన కోహ్లీ

ఈ డబ్బును దేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ కేర్ నర్సులను నియమించడానికి ఉపయోగిస్తారు. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్(77) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (23) జట్టు స్కోరు 180 వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. హాజెల్‌ఉడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టిమ్‌పైన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు.

నల్ల బ్యాండ్లతో టీమిండియా

మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు తమ చేతికి నల్ల బ్యాండ్లు ధరించిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లూ నల్లటి రిబ్బన్లు ధరించడం సచిన్‌, వినోద్‌ కాంబ్లీ వంటి క్రికెట్ దిగ్గజాలను భారతీయ క్రికెట్‌ జట్టుకు అందించిన ఘనత అచ్రేకర్‌‌దే. అచ్రేకర్‌ మృతికి ఇప్పటికే అనేకమంది సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.విశేషం.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా నల్లబ్యాండ్లను

ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బిల్‌ వాట్సన్‌(87) ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణానికి సంతాపంగా ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు కూడా నల్లబ్యాండ్లు ధరించారు. గురువారం ప్రారంభమైన సిడ్నీ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. భారత బ్యాట్స్‌మన్ పుజారా సెంచరీతో చెలరేగగా, ఓపెనర్ మయాంక్ అగర్వాల్(77) హాఫ్ సెంచరీతో రాణించగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.

1
43626
Story first published: Thursday, January 3, 2019, 14:02 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X