న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులో భేదాభిప్రాయాలు సహజమే: కోచ్‌ భరత్‌ అరుణ్‌

Bharat Arun Gives Clarity On Differences Between Kohli And Rohith || Oneindia Telugu
Virat Kohli-Rohit Sharma rift: Bowling coach Bharat Arun gives clarity on post-World Cup rumours


భారత జట్టులో ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు సహజమే అని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ పేర్కొన్నారు. ప్రపంచకప్‌ సెమీస్ నుండి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు వచ్చాయని రూమర్లు చక్కర్లు కొట్టాయి. మరోవైపు అన్ని ఫార్మాట్లకు కోహ్లీని కెప్టెన్‌గా కాకుండా.. పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేయాలని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య విభేదాలపై బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ స్పందించాడు.

ఓవర్‌త్రో నిర్ణయంపై ఎప్పటికీ చింతించను: అంపైర్ఓవర్‌త్రో నిర్ణయంపై ఎప్పటికీ చింతించను: అంపైర్

భిన్నాభిప్రాయాలు ఉంటాయి:

భిన్నాభిప్రాయాలు ఉంటాయి:

'ప్రతి విషయంపై జట్టులోని ఆటగాళ్ల అందరికి ఒకేలా అభిప్రాయాలు ఉండవు. జట్టు కూర్పు, వ్యూహాలపై వాద ప్రతివాదాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ.. చివరకు అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు' అని భరత్‌ తెలిపాడు. అన్ని విషయాలను అందరూ అంగీరించలేరు అని అభిప్రాయపడ్డారు.

మద్దతుగా రోహిత్:

మద్దతుగా రోహిత్:

'రోహిత్ తరచూ కోహ్లీతో చర్చలు జరుపుతాడు. ఇద్దరు బాగా కలిసిపోతారు. ఒకరి సామర్థ్యం గురించి మరొకరు ప్రశంసలు చేసుకుంటారు. కోహ్లీ జట్టును బాగా నడిపించాడు. కెప్టెన్‌గా పరిపక్వం చెందుతున్నాడు. అతనికి మద్దతుగా రోహిత్ ఉండటం ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తి జట్టు మొత్తంలో ఉండడం అద్భుతం' అని అరుణ్ పేర్కొన్నాడు.

ధోనీ లెజెండ్:

ధోనీ లెజెండ్:

'ఎంఎస్ ధోనీపై విమర్శలు చేయడం సరికాదు. అతను భారత జట్టుకు ఎంతో సేవ చేసాడు. అతను ఒక లెజెండ్. విరాట్ కోహ్లీ అనేక సందర్భాల్లో ధోనీ ఆలోచనలను, సూచనలను గౌరవిస్తాడు. సెమీ ఫైనల్లో ధోనీ ఉన్నంతవరకు మేమంతా విజయంపై నమ్మకంగా ఉన్నాం. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో చాలా బాధేసింది' అని అరుణ్ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, July 22, 2019, 11:07 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X