న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ముగ్గురి వల్లే రాణించగలుగుతున్నా: ఖలీల్ అహ్మద్

India vs Australia : Dhoni,Kohli,Rohith's Suggestions Helped Me Alot : Khaleel Ahmed | Oneindia
Virat Kohli and Rohit Sharma gave me freedom to express myself: Khaleel Ahmed

హైదరాబాద్: టీమిండియాలో మార్పులు కోసం తంటాలు పడిన సెలక్టర్లు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఒడిసిపట్టుకున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్‌ వంటి మెగా టోర్నీ కోసం దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్‌ యువ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌కు సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ బౌలర్‌ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగాడు.

ఉపఖండపు పిచ్‌లపై రాణించిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. పేస్‌కు స్వర్గధామమైన ఆసీస్‌ పిచ్‌లపై అసలు పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. ఆసీస్‌ సిరీస్‌కు ఎంపిక కావడం, గత సిరీస్‌లలో తన ప్రదర్శన , సీనియర్ల సూచనలు తదితర అంశాలు తన కెరీర్‌లో చక్కటి మార్పులు తెచ్చాయని ఖలీల్ అంటున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపైనే అసలైన సిరీస్

ఆస్ట్రేలియా గడ్డపైనే అసలైన సిరీస్

ఆస్ట్రేలియా సిరీస్‌ గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని ఖలీల్‌ స్పష్టం చేశాడు. అసలైన సవాల్‌ ఆసీస్‌లోనే మొదలవుతుందని దానిని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నానని తెలిపాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయడమే తన ప్రధాన సూత్రమని, ఆసీస్‌లో కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని వివరించాడు.

ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల వల్లే ఇలా

ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల వల్లే ఇలా

టీమిండియాకు ఎంపికయ్యాయని తెలియడంతో ఉద్వేగం, ఆనందం, భయం కలిగింది. కానీ సీనియర్ల సలహాలు, వారి ప్రోత్సాహంతో దాని నుంచి బయటపడ్డాను. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని, కెప్టెన్ విరాట్‌ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మల సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. ధోని వికెట్‌ వెనకాల ఉంటే ఏ బౌలర్‌కైనా సగం పని సులువైపోతుంది.

రోహిత్ నా ఇష్టానికే వదిలేసేవాడు

రోహిత్ నా ఇష్టానికే వదిలేసేవాడు

ఇక తన తొలి మ్యాచ్‌ సారథి రోహిత్ శర్మను ఈ యువ పేసర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. బౌలింగ్‌ చేసేటప్పుడు స్వేచ్చనిచ్చేవాడని, ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఆసియాకప్‌ను రోహిత్‌ను అందుకున్న తర్వాత ఆ ట్రోఫిని తనకివ్వడంతో ఒక్క సారిగా ఉద్వేగానికి గురయ్యానని తెలిపాడు. ఇక ఆసియాకప్‌తో సహా, వెస్టిండీస్‌పై నెగ్గిన వన్డే, టీ20 సిరీస్ ట్రోఫీలను సారథులు ఖలీల్‌కు అందించిన విషయం తెలిసిందే

డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ఫన్నీగా

డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ఫన్నీగా

రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడని తెలియజేశాడు. టీమిండియా పరుగుల యంత్రం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, అతడిలా ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే భవిష్యత్‌లో గొప్ప బౌలర్‌ అవుతాననే నమ్మకం ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు. ఇక బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఇచ్చిన అమూల్యమైన సూచనలు గత సిరీస్‌లలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపాడు.

Story first published: Tuesday, November 13, 2018, 18:02 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X