న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvWI: లంచ్ విరామానికి టీమిండియా 506/5, కోహ్లీ సెంచరీ

Virat Kohli Piles More Misery On Windies, India Cross 500

హైదరాబాద్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. టీమిండియా లంచ్ విరామానికి 506/5 స్కోరు చేసింది. క్రీజులో 215 బంతులాడిన కోహ్లీ (120), 33 బంతులాడిన రవీంద్ర జడేజా(19)లు ఉన్నారు. తొలిరోజు పృథ్వీ షా సెంచరీతో ఆరంభించగా.. రెండో రోజు కెప్టెన్ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించాడు. దేవేంద్ర బిషూ వేసిన బంతికి ఫోర్‌ కొట్టిన కోహ్లీ 184 బంతుల్లో కోహ్లీ టెస్టు కెరీర్‌లో 24వ సెంచరీ పూర్తి చేశాడు.

Virat Kohli Piles More Misery On Windies, India Cross 500
సెంచరీకి ముందు పంత్ ఔట్:

సెంచరీకి ముందు పంత్ ఔట్:

షాట్‌లపైన కాకుండా సింగిల్స్ మీదే ధ్యాస పెట్టిన కోహ్లీ.. బంతులను బలంగా కొట్టకుండా నిదానంగా ఆడుతున్న విరాట్‌ సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. కోహ్లి ఇన్నింగ్సులో కేవలం 7 ఫోర్లు మాత్రమే బాదాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మిడిలార్డర్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 92 పరుగుల వద్ద దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో కీమో పాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

వెస్టిండీస్‌పై కోహ్లీ సెంచరీ.. కెరీర్‌లో 24వది

కోహ్లి టెస్టుల్లో 24వ సెంచరీ

కోహ్లి టెస్టుల్లో 24వ సెంచరీ

రెండో రోజు ఉదయం కాస్త జాగ్రత్తగా ఆడిన పంత్‌.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అక్కడి నుంచి జోరు పెంచి వన్డే తరహాలో విరుచుకుపడ్డాడు. శతకానికి చేరువైన దశలో దురదృష్టవశాత్తూ ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లో 24వ సెంచరీ సాధించాడు. ఓవర్ నైట్ స్కోరు364/4తో కోహ్లీ పాటు క్రీజులో రిషబ్ పంత్ (17 బ్యాటింగ్: 21 బంతుల్లో 1 ఫోర్, , 1సిక్సు) తో ఇన్నింగ్స్ ఆరంభించారు.

విండీస్ బౌలర్లకు చుక్కలు

విండీస్ బౌలర్లకు చుక్కలు

ఓపెనర్ పృథ్వి షా (134) సెంచరీ, పుజారా (86), కోహ్లి (72 నాటౌట్)లు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ముఖ్యంగా తొలి టెస్ట్ ఆడుతున్న పృథ్వీ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు.. కేవలం 99 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.

17 పరుగులతో నాటౌట్‌గా పంత్

17 పరుగులతో నాటౌట్‌గా పంత్

షా ఔటైనా వెంటనే.. కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానే (41) మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో రన్ మెషీన్ విరాట్ టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే ఔటైనా.. కోహ్లి మాత్రం 72 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. మరోవైపు రిషబ్ పంత్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

1
44264
Story first published: Friday, October 5, 2018, 15:51 [IST]
Other articles published on Oct 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X