న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌పై కోహ్లీ సెంచరీ.. వందకు ముందే పంత్ ఔట్

India vs West Indies 2018: Virat kohli Slams 24th Century In His Career
Virat Kohli Hits Century But Rishabh Pant Falls As India Dominate

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ బాదేశాడు. 184 బంతుల్లో 7ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. కెరీర్‌లో 24వ సెంచరీని నమోదు చేశాడు. అతనికి తోడుగా క్రీజులో ఉన్న రిషబ్ పంత్ (92)84 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సులు) కూడా దూకుడుగా ఆడి శుక్రవారం తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరుకున్నారు.

<strong>సెహ్వాగ్ లాంటి జీనియస్‌తో పృథ్వీని పోల్చొద్దు: గంగూలీ</strong>సెహ్వాగ్ లాంటి జీనియస్‌తో పృథ్వీని పోల్చొద్దు: గంగూలీ

Virat Kohli Hits Century But Rishabh Pant Falls As India Dominate

ఓవర్‌నైట్ స్కోరు 364/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు 107 ఓవర్లు ముగిసే సమయానికి 465/4తో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(111), జడేజా (10) ఉన్నారు. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. అంతగా అనుభవం లేని వెస్టిండిస్ బౌలర్లను భారత బ్యాట్స్‌మన్ ఓ ఆటాడుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన.. యువ ఓపెనర్ పృథ్వీ షా (134) సెంచరీతో పాటు పుజారా (86), కోహ్లీ (72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మూడు పరుగుల వద్దే లోకేశ్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. గాబ్రియల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయిన రాహల్ డకౌట్ అయ్యాడు.

1
44264

క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుత ప్రదర్శన చేశాడు. కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నా.. ఆ ఒత్తిడేమీ అతడిలో కనిపించలేదు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పృథ్వీషా... కేవలం 99 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. పుజారాతో కలిసి పృథ్వీషా అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు.

Story first published: Friday, October 5, 2018, 15:50 [IST]
Other articles published on Oct 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X