న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిశాస్త్రి, హర్ష భోగ్లే కాదు.. కోహ్లీ ఫేవరేట్ కామెంటేటర్ ఎవరంటే?

Virat Kohli picks Nasser Hussain ahead of Ravi Shastri, Harsha Bhogle as favourite commentator


ఢిల్లీ:
మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రపంచంలోని క్రీడా టోర్నీల‌న్నీ రద్దైన విషయం తెలిసిందే. ఎటువంటి టోర్నీలు లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించ‌ని విరామాన్ని స‌తీమ‌ణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే కోహ్లీ తన ఫామ్‌హౌస్ వెళ్ళిపోయాడు. ఇంటికే పరిమితమైన కోహ్లీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాడు. ప్రమాదకర వైరస్‌పై ఎప్పటికప్పుడు అభిమానులకు అవగాహన కల్పిస్తున్నాడు.
Virat Kohli Reveals His Favorite Commentator

చెత్త బంతి పడితే బౌండరీ బాదేస్తా.. మరో ఆలోచనే ఉండదు: షెఫాలీచెత్త బంతి పడితే బౌండరీ బాదేస్తా.. మరో ఆలోచనే ఉండదు: షెఫాలీ

పీటర్సన్ అయితే కాదు:

పీటర్సన్ అయితే కాదు:

తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌తో లైవ్‌లో ముచ్చటించిన విరాట్ కోహ్లీ అనేక విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. లైవ్‌లో కోహ్లీని చిక్కుల్లో ప‌డేసేలా పీటర్సన్‌ ఒక ప్రశ్న అడగ్గా.. దానికి సరదా జవాబిచ్చి ఇచ్చి తన చిలిపితనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇష్టమైన కామెంటేటర్ ఎవరని అడిగి.. ఆచితూచి స‌మాధానం ఇవ్వాలని కేపీ సూచించాడు. 'ఫేవరెట్ కామెంటేటర్ ఎవ‌ర‌లో చెప్పడం ఎంతో సులభమని, పీటర్సన్ అయితే కాదు' అని కోహ్లీ కొంటె సమాధానం ఇచ్చాడు. దీనికి పీటర్సన్ నవ్వుకున్నాడు.

అభిమాన కామెంటేటర్ హుస్సేన్:

అభిమాన కామెంటేటర్ హుస్సేన్:

తన అభిమాన కామెంటేటర్ ఎవరో చెప్పాలా అని పీటర్సన్‌ను కాపేపు కోహ్లీ ఆటపట్టించాడు. కొద్ది సమయం తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ నా అభిమాన కామెంటేటర్ అని కోహ్లీ చెప్పాడు. తన దేశానికే చెందిన మాజీ క్రికెటర్‌ను కోహ్లీ తన ఫేవరెట్ కామెంటేట‌ర్‌గా చెప్పడంతో.. పీటర్సన్‌ ఆనందం వ్యక్తం చేసాడు. దీనికి సంబందించిన చాట్‌ను కేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మరోవైపు రవిశాస్త్రి, హర్ష భోగ్లే పేర్లను కోహ్లీ చెపుతాడని ఆశించిన భారత అభిమానులు నిరాశకు గురయ్యారు.

ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా:

ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా:

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌ సందర్భంగా.. మైదానంలో ఎవరితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావు? అని కోహ్లీని పీటర్సన్ ప్రశ్నించగా.. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ అని సమాధానం ఇచ్చాడు. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేనని అన్నాడు. 'నాతో పోటీపడుతూ వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తే వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. టీమిండియా తరఫున ఆడే సమయంలో ధోనీ.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడేటప్పుడు డివిలియర్స్ నా జాబితాలో ఉన్నారు. ఈ ఇద్దరితో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య పరుగు కోసం ప్రత్యేకంగా పిలుపులు ఉండవు. ఒకరినొకరు చూసుకుని పరుగెత్తేస్తామంతే' అని కోహ్లీ తెలిపాడు.

 114మంది మృతి:

114మంది మృతి:

విరాట్ కోహ్లీ కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 114మంది మరణించగా 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 326 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు.

Story first published: Tuesday, April 7, 2020, 12:23 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X