న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ టెస్టు, వన్డే కెప్టెన్‌గా కోహ్లీ.. మరో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు!!

Virat Kohli Named Captain Of ODI & Test Teams Of The Year ! || Oneindia Telugu
Virat Kohli named captain of ICC Test, ODI teams of the Year

దుబాయ్‌: ఐసీసీ అవార్డుల్లో టీమిండియా వన్డే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దుమ్మురేపారు. 2019కి గాను ఐసీసీ బుధవారం పురస్కారాలను ప్రకటించింది. కోహ్లీకి స్పిరిట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు, రోహిత్‌కి వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు దక్కాయి. అలాగే టెస్టు, వన్డే జట్టును కూడా ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ టెస్టు, వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.

ఐసీసీ అవార్డ్స్‌: టాప్ లేపిన రోహిత్, విరాట్.. ఐసీసీ కెప్టెన్‌గా కోహ్లీఐసీసీ అవార్డ్స్‌: టాప్ లేపిన రోహిత్, విరాట్.. ఐసీసీ కెప్టెన్‌గా కోహ్లీ

 కెప్టెన్‌గా కోహ్లీ:

కెప్టెన్‌గా కోహ్లీ:

ఐసీసీ టెస్ట్ జట్టులో భారత్‌ నుంచి విరాట్ కోహ్లీతో పాటు యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ చోటు దక్కించుకున్నాడు. పుజారా, అశ్విన్, రహానేలకు చోటు దక్కలేదు. ఐసీసీ టెస్ట్ జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 5 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురు, ఇంగ్లాండ్‌ నుంచి ఒక్కరు ఈ జట్టులో స్థానం దక్కించుకున్నారు.

వన్డే జట్టులో రోహిత్‌, షమీ, కుల్దీప్‌:

వన్డే జట్టులో రోహిత్‌, షమీ, కుల్దీప్‌:

ఐసీసీ ప్రకటించిన వన్డే జట్టుకు కూడా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఎంపికయ్యాడు. కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ, మహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌ ఐసీసీ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చుక్కెదురైంది. గత ఆరు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న కారణంగా చోటు దక్కలేదు.పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా స్థానం దక్కలేదు.

రెండు ఫార్మాట్లలో ముగ్గురికి చోటు:

రెండు ఫార్మాట్లలో ముగ్గురికి చోటు:

ఐసీసీ ప్రకటించిన టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లలోనూ స్థానం సంపాదించిన ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లీ (భారత్‌), మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా), బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లాండ్‌) మాత్రమే ఉన్నారు. ఈ రెండు జట్లకు విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికవడం గమనర్హం. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. రెండు ఫార్మాట్లలో కోహ్లీతో పాటు మరో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఐసీసీ టెస్టు జట్టు:

ఐసీసీ టెస్టు జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, టామ్‌ లాథమ్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, డీజే వాట్లింగ్‌ (వికెట్‌ కీపర్‌), ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నైల్‌ వాగ్నర్‌, నాథన్‌ లియాన్‌.

ఐసీసీ వన్డే జట్టు:

రోహిత్‌ శర్మ, షై హోప్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), బాబార్‌ ఆజమ్‌, కేన్‌ విలియమ్సన్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌.

Story first published: Thursday, January 16, 2020, 10:00 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X