న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షేన్‌ వార్న్‌ నా రోల్‌ మోడల్‌: చాహల్

Kohli Made Me Realise the Importance of Fitness,Says Chahal
Virat Kohli Made Me Realise the Importance of Fitness, shane warne is my role model Says Yuzvendra Chahal

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రభావం తనపై చాలా ఉందని భారత జట్టు స్పిన్నర్ చాహల్‌ చెప్పుకొస్తున్నాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి చాహల్‌ స్థిరంగా రాణిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఇటు ఐపీఎల్‌తో పాటు అటు టీమిండియాలోనూ చాహల్‌ రాణిస్తున్నాడు.

'ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ నా రోల్‌ మోడల్‌. అతని బౌలింగ్‌ చూస్తూ పెరిగాను. అండర్‌-14లో ఆడే సమయంలో నేను వార్న్‌ శైలిలోనే బౌలింగ్‌ చేసేవాడిని. అండర్‌-19లో హరియాణా తరఫున ఆడే సమయంలో ఓ మ్యాచ్‌ మధ్యలో అనుకోకుండా నా బౌలింగ్‌ శైలిని మార్చుకున్నాను. కాస్త దూరం పరిగెత్తి, బంతి కాస్త తక్కువగా స్పిన్‌ అయ్యేలా బంతులేసేందుకు ప్రయత్నించాను. నేను తీసుకున్న నిర్ణయాల్లో ఇదో బెస్ట్‌. మ్యాచ్‌ మధ్యలో ఒత్తిడికి గురైనప్పుడు ఎలాంటి ఆందోళనకు గురికాను. ఎందుకంటే నేను ఇప్పుడు మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నాను' అని చాహాల్ వివరించాడు.

'బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' అనే వెబ్‌ షో ద్వారా చాహల్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 'కోహ్లీ నాకు అన్నయ్య లాంటివాడు. నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాడు. మైదానం లోపలే కాదు వెలుపల కూడా కోహ్లీ నాకు ఎంతో సాయం చేస్తాడు. నాపై అతని ప్రభావం చాలా ఉంది. కోహ్లీ వల్ల నా జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకసారి కోహ్లీ నాకు ఏమని చెప్పాడంటే..

'ఎప్పుడూ ఫిట్‌గా ఉండు. అవకాశాలు వాటంతట అవే నీ దగ్గరకు వస్తాయి' అని అన్నాడు. ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేసిన తర్వాత కూడా నేను చాలా యాక్టివ్‌గా, ప్రశాంతంగా ఉంటాను' అని చాహల్‌ చెప్పాడు.

Story first published: Tuesday, June 5, 2018, 8:39 [IST]
Other articles published on Jun 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X