న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు గడ్డముంటేనే ఇష్టం, తీసే ప్రసక్తే లేదు: కోహ్లీ

Virat Kohli Likes His Beard, Wont Shave It Off Any Time Soon

హైదరాబాద్: విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గానే కాదు. మోస్ట్ ఫాలోవ్‌డ్ యూత్ ఐకాన్‌గానూ పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఫామస్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఏం చేసినా ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అతని ఎడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేందుకు ప్రముఖ వాణిజ్య కంపెనీలన్నీ కోహ్లీ వెంట పడుతూంటాయి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఓ అభిమాని విరాట్‌ను తన గడ్డంపై సందేహాలు అడిగాడట.

'ఇప్పుడు ఫ్యాషన్‌గా నడుస్తోంది కాబట్టి గడ్డం పెంచుతున్నారు. రేపు ట్రెండ్ మారితే తీసేస్తారా..?' అని అడిగాడంట. దానికి బదులిచ్చిన కోహ్లీ ఇలా పెంచుకోవడమంటే నాకు చాలా ఇష్టం. దీనిని తీసే ప్రసక్తే లేదు. ఒకవేళ బాగా పెరిగిందనిపిస్తే ట్రిమ్ చేసుకుంటానే గానీ, షేవ్ చేసుకోను అని బదులిచ్చాడట.

ఈ గడ్డంపై ఓ సారి టీమిండియా సహచరుల మధ్య చర్చ జరిగినప్పుడు నువ్వు ఆ పని మాత్రం చేయలేవ్ అంటూ విరాట్ సతీమణి అనుష్క శర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల నుంచి టీమిండియాలో ఇలా పెంచుకోవడం అందరికీ పరిపాటైపోయింది. పాండ్యా, రోహిత్ శర్మలు తప్పించి అందరూ షేపింగ్ చేసుకున్న గడ్డాలతోనే ఉంటున్నారు.

అంతేకాదు, టీమిండియా కెప్టెన్ ఇప్పటికీ తన షూస్ తానే తుడుచుకుంటాడట. అతని వార్డ్ రోబ్‌లో ఎప్పుడూ రెండు జతల బూట్లు ఉంటాయట. వాటిని 2వారాలకోసారి కోహ్లీనే తుడుచుకుంటాడు. ఐపీఎల్ అనంతరం ప్రణాళికలో భాగంగా కోహ్లీ కౌంటీ క్రికెట్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీనికి పలువురు హర్షం వ్యక్తం చేయగా, మిగిలిన వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Story first published: Thursday, May 17, 2018, 17:45 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X