న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజ్డెన్‌ టీ20 జట్టు: ధోనీ, రోహిత్‌కి దక్కని చోటు.. కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్!!

Virat Kohli, Jasprit Bumrah in Wisden T20I Team of the Decade, MS Dhoni, Rohit Sharma miss out

న్యూఢిల్లీ: 2019 ముగుస్తుండటంతో విజ్డెన్‌ ఇప్పటికే ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు, వన్డే అంతర్జాతీయ జట్లను ప్రకటించింది. అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జట్టును కూడా ఎంపిక చేసింది. తాజాగా ఈ దశాబ్దపు టీ20 జట్టును విజ్డెన్‌ ప్రకటించింది. 2010-2019 మధ్య కాలంలో టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణించిన ఆటగాళ్లకు చోటిచ్చింది. అయితే కొందరు సీనియర్, స్టార్ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.

డబ్బు కోసం నా దేశాన్ని తాకట్టు పెట్టలేదు.. రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా!!డబ్బు కోసం నా దేశాన్ని తాకట్టు పెట్టలేదు.. రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా!!

కెప్టెన్‌గా ఫించ్:

కెప్టెన్‌గా ఫించ్:

విజ్డెన్‌ టీ20 జట్టులో కేవలం ఇద్దరు భారత ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. ఒకరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాగా.. మరొకరు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు విజ్డెన్‌ టీ20 జట్టులో చోటు దక్కలేదు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌కి కూడా అవకాశం దక్కలేదు. కోహ్లీ ఎంపికయినా.. ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను కెప్టెన్‌గా ఎంపికచేశారు.

 రోహిత్‌కు దక్కని చోటు:

రోహిత్‌కు దక్కని చోటు:

అంతర్జాతీయ టీ20ల్లో కేవలం స్ట్రైక్‌రేట్ ఆధారంగా టీమ్‌ని ఎంపిక చేసినట్లు విజ్డెన్ పేర్కొంది. దీంతో రోహిత్ శర్మకు నిరాశే ఎదురైంది. ఓపెనర్లుగా కొలిన్ మున్రో (160.04 స్ట్రైక్‌రేట్), అరోన్ ఫించ్ (156.50)లు చోటు దక్కించుకున్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (138.07) ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్‌ (147.58), పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌‌ (160)లకు నాలుగు, ఐదు స్థానాల్లో ఛాన్స్ దక్కింది.

మహీకి నిరాశే:

మహీకి నిరాశే:

వికెట్ కీపర్ రేసులోకి ధోనీ వచ్చినా.. జోస్ బట్లర్ స్ట్రైక్‌రేట్ ఎక్కువగా ఉండటంతో మహీకి నిరాశే ఎదురైంది. ధోనీ స్ట్రైక్‌రేట్ 132 కాగా .. బట్లర్ స్ట్రైక్‌రేట్ 172. స్పిన్నర్ల కోటాలో రషీద్ ఖాన్ (84 వికెట్లు) మహ్మద్ నబీ (1316 రన్స్, 69 వికెట్లు)లు చోటు దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ల జాబితాలో డేవిడ్ విల్లీ (34 వికెట్లు), జస్‌ప్రీత్ బుమ్రా (51 వికెట్లు), లసిత్ మలింగ (82 వికెట్లు) లకు అవకాశం దక్కింది.

 విజ్డెన్ టీ20 జట్టు:

విజ్డెన్ టీ20 జట్టు:

అరోన్ ఫించ్ (కెప్టెన్), కొలిన్ మున్రో, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, డేవిడ్ విల్లీ, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.

Story first published: Monday, December 30, 2019, 15:19 [IST]
Other articles published on Dec 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X