న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvENG, మూడో టెస్టు: తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం

Virat Kohli inspires India fightback but misses century in third England Test

ముంబై: ఇంగ్లీషు గడ్డపై భారీ పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా మూడో టెస్టులో స్టైల్ మార్చింది. జట్టులో కొద్దిపాటి మార్పులు చేపట్టి ఆధిపత్యం దిశగా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలిరోజే 307 స్కోరుతో ఇంగ్లాండ్‌‌కి ఊహించని షాకిచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (97), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (81) కొద్దిలో సెంచరీలను చేజార్చుకున్నా.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్‌ని మెరుగైన స్థితిలో నిలిపారు.

1
42376
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్:

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్:

దీంతో.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 307/6తో నిలవగా.. క్రీజులో రిషబ్ పంత్ (22 బ్యాటింగ్: 32 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సు) ఉన్నాడు. టాసె గెలిచిన రూట్ అనూహ్యంగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండో టెస్టులో వేటుకి గురై.. మూడో టెస్టులో మురళీ విజయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ (35: 65 బంతుల్లో 7 ఫోర్లు) దూకుడుగా ఆడి స్కోరు బోర్డుని నడిపించాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (23: 53 బంతుల్లో 4ఫోర్లు) కూడా నిలకడగా ఆడటంతో భారత్‌కి 59/0తో మెరుగైన ఆరంభమే లభించింది.

ఆరంభంలో తడబడినా.. ఇన్నింగ్స్ అదిరింది:

ఆరంభంలో తడబడినా.. ఇన్నింగ్స్ అదిరింది:

కానీ.. ఐదు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరూ వరుసగా పెవిలియన్‌ చేరిపోగా.. తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా (14: 31 బంతుల్లో 2ఫోర్లు) వైఫల్యాల పరంపరని కొనసాగించాడు. దీంతో.. భారత్ 82/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె(81, , 131 బంతుల్లో 12 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఈ జోడి.. ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించింది. దీంతో.. 159 పరుగుల అభేద్య భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ కష్టమే మళ్లీ జట్టును నిలబెట్టి:

కోహ్లీ కష్టమే మళ్లీ జట్టును నిలబెట్టి:

కెప్టెన్ విరాట్ కోహ్లి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అజింక్య రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుని మెరుగైన స్థితిలో నిలిపిన విరాట్ కోహ్లీ (97, 152 బంతుల్లో 11 ఫోర్లు) స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్‌వోక్స్ మూడు, ఆదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకెళ్తుండగా.. ఇంగ్లాండ్ వారి జోరుకి బ్రేక్‌లేసింది. జట్టు స్కోరు 241 వద్ద రహానె‌ని బ్రాడ్ ఔట్ చేయగా.. 279 వద్ద విరాట్ కోహ్లీని ఆదిల్ రషీద్ బుట్టలో వేశాడు.

తొలి రోజు ముగిసే సమయంలో పాండ్యా ఔట్:

తొలి రోజు ముగిసే సమయంలో పాండ్యా ఔట్:

అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (18: 58 బంతుల్లో 4x4) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగా.. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన రిషబ్ పంత్ సిక్స్‌తో తన పరుగుల ఖాతాని తెరిచి చివరి వరకూ అదే జోరుని కొనసాగించాడు. ఆట మరో నిమిషంలో ముగుస్తుందన్న దశలో హార్దిక్ పాండ్య ఔటవగా.. తొలి రోజు ఆటని అంపైర్లు నిలిపివేశారు.

Story first published: Sunday, August 19, 2018, 11:21 [IST]
Other articles published on Aug 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X