న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాతో మ్యాచ్: కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా

Virat Kohli Fined ₹500 For Washing Car With Drinking Water || Oneindia Telugu
Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి గురుగ్రామ్ నగర్ నిగమ్ అధికారులు జరిమానా విధించారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌లో ఉంటే కోహ్లీకి జరిమానా విధించడం ఏంటని అనుకుంటున్నారా? అవును. కోహ్లీ నివాసంలో పనివాళ్లు చేసిన తప్పుకి కోహ్లీకి జరిమానా విధించారు అక్కడి అధికారులు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

డీఎల్‌ఎఫ్ ఫేజ్-1లో ఉన్న కోహ్లీ ఇంట్లోని కార్లు శుభ్రం చేయడాన్ని గాను లీటర్ల కొద్ది తాగునీటిని వాడారు. ఈ విషయాన్ని గమనించిన పక్కింటి వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీటిని వృథా చేసినందుకు మున్సిపల్ అధికారులు రూ.500 జరిమానా విధిస్తూ చలాన్‌ను ఇంటికి పంపారు.

కోహ్లీతో పాటు మరో 10 మందికి కూడా చలాన్లు జారీ చేసినట్లు మున్సిపల్ ఇంజినీర్ అమన్ ఫొగట్ పేర్కొన్నారు. వేసవి కాడవంతో ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువగా ఉంది. గురుగ్రామ్‌లో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో కోహ్లీ ఇంట్లో పని చేసేవాళ్లు కార్లను మంచి నీటితో కడుగుతున్నప్పుడు వీడియో కూడా తీశారు.

దీంతో మున్సిపల్‌ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. వరల్డ్‌కప్‌లో టీమిండియా తన తదుపరి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Story first published: Friday, June 7, 2019, 21:34 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X