న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli : సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు బద్దలు!

Virat kohli broke three records with his sizzling knock against bangladesh

పొట్టి ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులే ఆడిన అతను ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్ అంటేనే అతను ఏ రేంజ్‌లో ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ప్రతి మ్యాచులోనూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే రిపీట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. భారత స్కోరు 180 పరుగుల మార్క్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడే క్రమంలో మూడు కీలక రికార్డులను కూడా బద్దలు కొట్టాడీ స్టార్ ప్లేయర్. ఈ మ్యాచ్‌లో రాహుల్ కూడా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు

ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు

బంగ్లాపై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. బంగ్లాతో మ్యాచ్‌లో 64 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. మొత్తమ్మీద ఆస్ట్రేలియాలో 3,350 పరుగులు నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ గడ్డపై 3,300 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది. దీన్ని కోహ్లీ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీ చేసిన 3350 పరుగుల్లో.. 1352 పరుగులు టెస్టుల్లో చేసినవి. అలాగే 29 వన్డేల్లో 1327 పరుగులు, 15 టీ20 మ్యాచుల్లో 671 పరుగులు చేశాడు.

డెత్ ఓవర్లలో బౌండరీల వరద..

డెత్ ఓవర్లలో బౌండరీల వరద..

కోహ్లీ ఇన్నింగ్స్‌లో అందరినీ ఆకట్టుకునే అంశం అతని పేసింగ్. ఆరంభంలో కొంచెం నెమ్మదిగా ఆడే కోహ్లీ.. ఆ తర్వాత క్రీజులో కుదురుకునే కొద్దీ గేరు మారుస్తాడు. అవసరమైన సమయంలో ఎలాంటి బంతికైనా బౌండరీ బాదగల సత్తా అతని సొంతం. పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ బంతిని ఆఫ్‌సైడ్ సిక్సర్ బాదిన షాట్ దానికి నిదర్శనం.

కేవలం ఆ మ్యాచ్‌లోనే కాదు. ఆ తర్వాత ఆడిన మ్యాచుల్లో కూడా కోహ్లీ ఇలాగే ఆడుతున్నాడు. డెత్ ఓవర్లు అంటే 16-20 ఓవర్లలో అవసరమైనప్పుడల్లా బౌండరీలు బాదేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ లెజెండ్, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. డెత్ ఓవర్లలో ధోనీ తన కెరీర్‌లో 104 బౌండరీలు (సిక్సర్లు, ఫోర్లు) బాదగా.. కోహ్లీ 106 బౌండరీలతో ధోనీని అధిగమించాడు.

టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు

టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు

ఇప్పటి వరకు జరిగిన పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. బంగ్లాపై అతను చేసిన 64 పరుగులతో కేవలం టీ20 వరల్డ్ కప్‌లలో కోహ్లీ చేసిన పరుగుల సంఖ్య 1065కు చేరింది.

ఇప్పటి వరకు ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును ఈ క్రమంలో కోహ్లీ బద్దలు కొట్టాడు. జయవర్దనే మొత్తం 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేశాడు. కోహ్లీ కేవలం 25 మ్యాచుల్లోనే ఈ రికార్డు సృష్టించడం గమనార్హం. కోహ్లీ సగటు 88.7 కాగా, స్ట్రైక్‌రేట్ 132.4గా ఉంది.

Story first published: Thursday, November 3, 2022, 18:02 [IST]
Other articles published on Nov 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X