న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్, ధోని రికార్డు బద్దలు: భారత్‌లో 4000 పరుగులు చేసిన కోహ్లీ

Virat Kohli becomes quickest batsman to score 4000 runs in India; 3rd Indian after MS Dhoni, Sachin Tendulkar

హైదరాబాద్: విశాఖపట్టణం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని సాధించాడు.

<strong>వైజాగ్ వన్డేలో కోహ్లీ సాహసోపేత నిర్ణయం వెనుక అసలు కారణం ఇదీ</strong>వైజాగ్ వన్డేలో కోహ్లీ సాహసోపేత నిర్ణయం వెనుక అసలు కారణం ఇదీ

వన్డేల్లో కోహ్లీకి ఇది 49వది కావడం విశేషం. 24వ ఓవర్‌లో ఒబెద్ మెకాయ్ వేసిన బంతికి సింగిల్ సాధించడం ద్వారా కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా కెప్టెన్‌కు విశాఖలో ఇది 3వ హాఫ్ సెంచరీ. ఫలితంగా సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

1
44267
4000 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ

4000 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ

కోహ్లీకి కంటే ముందు ఈ రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అందుకున్నారు. సొంతగడ్డపై 4000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 92 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, ధోనికి 100 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ(78 ఇన్నింగ్స్‌లు) బద్దలు కొట్టాడు.

ఏబీ రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

ఏబీ రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

ఏబీ డివిలియర్స్ ఈ రికార్డుని 91 ఇన్నింగ్స్‌ల్లో అందుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మరో 31 పరుగులు చేస్తే కోహ్లీ 10 వేల పరుగుల క్లబ్‌లో చేరతాడు. కాగా, అంతకముందు కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓబెడ్ బౌలింగ్‌లో బంతిని మిడాఫ్ దిశగా హిట్ చేసేందుకు విరాట్ కోహ్లి (44) ప్రయత్నించాడు.

తడబడిన హోల్డర్... కోహ్లీకి లైఫ్

అయితే.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ క్యాచ్‌ని అందుకోలేకపోయాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో తడబడిన హోల్డర్.. వెనక్కి వెళ్లి క్యాచ్‌ను పట్టే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రాయుడు

అప్పటికి కోహ్లీ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ప్రస్తుతం భారత్ జట్టు 30 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(62) అంబటి రాయుడు (68) పరుగులతో ఉన్నారు.

Story first published: Wednesday, October 24, 2018, 16:09 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X