న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్మప్ మ్యాచ్‍‌లో కోహ్లీ బౌలింగ్: వికెట్ మాత్రం తీయలేకపోయాడు (వీడియో)

India vs Australia XI 2018 : Virat Kohli Bowls During India's Tour Game At The SCG | Oneindia Telugu
VIDEO: Virat Kohli bowls during Indias tour game at the SCG

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా రెండు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ మాత్రం తీయలేకపోయాడు. నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజైన శుక్రవారం 24/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 65.3 ఓవర్లు ముగిసే సమయానికి 234/6తో నిలిచింది.

<strong>షాకు గాయం: వార్మప్ మ్యాచ్‌లో నిరాశపరిచిన భారత బౌలర్లు (వీడియో)</strong>షాకు గాయం: వార్మప్ మ్యాచ్‌లో నిరాశపరిచిన భారత బౌలర్లు (వీడియో)

దీంతో ఈ దశలో క్రీజులో పాతుకుపోయిన హారీ నిల్సెన్ (56 బ్యాటింగ్), అరోన్ హార్డై (69 బ్యాటింగ్)ల భాగస్వామ్యాన్ని విడదీసేందుకు విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. అయితే, అతడికి నిరాశే ఎదురైంది. కోహ్లీ బౌలర్లను మారుస్తూ.. ఆఖరి తాను కూడా బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయారు. నిల్సెన్-అరోన్ జోడి ఏకంగా 35.3 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి ఏకంగా 118 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 102 ఓవర్లలో 356/6తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌటైంది. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 73 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 27.1 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

Story first published: Friday, November 30, 2018, 16:06 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X