నేను చాలా పెద్ద తప్పు చేశా: రబాడ

Posted By:
Unhappy With Himself, Kagiso Rabada Promises to Learn from Mistake

హైదరాబాద్: మైదానంలో క్రమశిక్షణారహితంగా ప్రవర్తించినందుకుగాను రబాడపై ఐసీసీ రెండు టెస్టుల నిషేదాన్ని జారీ చేసింది. ఈ విషయంపై రబాడ విచారాన్ని వ్యక్తం చేశాడు. అంతేగాక, పశ్చాతాపాన్ని కోరుతూ.. తన వల్ల జట్టు కూడా నష్టపోయిందని వాపోయాడు. ఇంకో సారి ఇలా జరగదంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 11 వికెట్లతో ఈ ఫేసర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రబాడ తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఫలితంగా తన జట్టును సైతం నష్టానికి గురి చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ యువ పేసర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను బౌల్డ్‌ చేసి తీవ్రంగా అరిచాడు. ఈ ప్రవర్తనతో రబడ తర్వాతి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

రబడ మాట్లాడుతూ.. 'నేను ఇలా చేసుండాల్సింది కాదు. ఈ ప్రవర్తనతో మనిషిగా, వ్యక్తిగా ఎంతో దిగిజారిపోయా. ఈ ఘటనతో నేనెంతో నేర్చుకున్నా. ఇలాంటి తప్పిదాలను భవిష్యత్‌లో పునరావృతం కానివ్వను. స్మిత్‌ను ఉద్దేశ్యపూర్వకంగా తాకలేదు. లార్డ్స్‌ మైదానంలో నేను చేసింది తప్పని తెలిసే అప్పుడు అప్పీల్‌ చేయలేదు. నిజాయితీగా చేప్పాలంటే అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఓ పెద్ద సిరీస్‌ నుంచి దూరమయ్యాను. నేను చాలా ఆడాల్సింది. కీలక సమయంలో జట్టుకు దూరమయ్యానని' రబడ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకుముందు వార్నర్‌ ఘటనలో కూడా 15 శాతం మ్యాచ్‌ ఫీజు జరిమానాతో పాటు 1 డీమెరిట్‌ పాయింట్‌ను ఐసీసీ శిక్షగా విధించింది. దాంతో రబడ మొత్తం పాయింట్ల సంఖ్య 9కి చేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లో ఇరు జట్టు చెరోమ్యాచ్‌ గెలిచాయి. సరైన సమయంలో రబడా దూరం కావడం దక్షిణాఫ్రికా జట్టుకు నష్టం చేకూరనుంది.

Story first published: Tuesday, March 13, 2018, 17:37 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి