న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

360 డిగ్రీల్లో బౌలింగ్.. డెడ్ బాల్‌గా ప్రకటించిన అంపైర్(వీడియో)

'Switch' Bowling : Going Viral in Social Media | Oneindia Telugu
Umpire calls dead ball on UP spinner’s unique 360-degree action

హైదరాబాద్: టీమిండియా పోస్ట్ చేసిన ఈ వీడియోను రెండు వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. ఏ స్పిన్నరైనా బంతిని గిర్రున తిప్పేస్తాడు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ శివ సింగ్‌ మాత్రం బంతితోపాటు రనప్‌లో తానూ గిర్రున తిరిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ శివసింగ్‌ తన చుట్టూ తాను 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ బంతి విసిరాడు. దీంతో అంపైర్‌ ఆ బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటించాడు. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు సభ్యుడైన శివ.. పరుగెత్తుకుంటూ వచ్చి డెలివరీ వేయడానికి ముందు 360 డిగ్రీలు తిరిగాడు.

అంపైర్‌ వినోద్‌ దాన్ని డెడ్‌బాల్‌ ప్రకటించగా.. బౌలర్‌, ఫీల్డర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం.. ఏ బౌలరైనా కావాలని బ్యాట్స్‌మన్‌ ఏకాగ్రత చెదిరేలా బౌలింగ్‌ చేస్తే అంపైర్‌ దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించవచ్చు. దీంతో ఆ టీమ్ ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంపైర్‌తో వాదనకు దిగారు. అలా బౌలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అంపైర్ చెప్పారు.

ఈ వీడియోను భారత క్రికెట్ టీమ్ తమ ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. 'ఏమిటది? మనం స్విచ్ హిట్ గురించి విన్నాం. కానీ, స్విచ్ బౌలింగ్ యాక్షన్ ఎప్పుడూ చూడలేదు. క్రికెట్ చరిత్రలో ఈ తరహా బౌలింగ్ ఇదే తొలిసారి కావచ్చు. తప్పకుండా చూడండి' అంటూ ఈ వీడియో పోస్ట్ చేశారు. మీరు కూడా ఆ బౌలింగ్‌‌పై ఓ లుక్కేయండి మరి!

Story first published: Friday, November 9, 2018, 9:49 [IST]
Other articles published on Nov 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X