న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాత్రిపూట మామిడికాయలు దొంగలించేవాడిని: స్టార్ పేసర్

Umesh Yadav said I was so naughty in my childhood that I wouldnt sleep at nights

న్యూఢిల్లీ: చిన్నతనంలో చాలా అల్లరితనంగా ఉండేవాడిని అని టీమిండియా పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ (32) తెలిపాడు. రాత్రిపూట అస్సలు నిద్రపోయే వాడిని కాదని, మామిడి పండ్ల తోటలో దొంగతనం చేసేవాడినని చెప్పాడు. క్రికెట్‌ ఆడే తొలినాళ్లలో స్పైక్‌ షూ లేవనే కారణంతో ఓ కోచ్‌ తనని ఆడనివ్వని ఘటనను ఉమేశ్‌ గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఉమేశ్‌ క్రిక్‌బజ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ తన క్రికెట్‌ కష్టాలను వివరించాడు.

ప్రపంచకప్‌ ఓటమి ఇప్పటికీ బాధిస్తోంది: టీమిండియా కోచ్ప్రపంచకప్‌ ఓటమి ఇప్పటికీ బాధిస్తోంది: టీమిండియా కోచ్

ఆ బంతుల్ని టీవీలో మాత్రమే చూశా:

ఆ బంతుల్ని టీవీలో మాత్రమే చూశా:

'కెరీర్‌లో చాలా ఆలస్యంగా సీజన్‌ బాల్‌ను (కర్క్‌బాల్‌) అందుకున్నా. అంతకుముందు ఆ బంతుల్ని టీవీలో మాత్రమే చూశా. వాటితో కూడా ఆడతారనే విషయం తనకు అప్పుడే తెలిసింది. నాగ్‌పూర్‌లో గల్లీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు నేను యార్కర్లు బాగా వేస్తున్నానని ఎవరో గుర్తించి జిల్లా క్రికెట్‌ సంఘానికి తెలియజేశారు. వాళ్లు నా బౌలింగ్‌ను పరిశీలించి నాగ్‌పూర్‌ జట్టుకు ఆడే అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టా. ఆ తర్వాత వేసవి శిక్షణ శిబిరానికి రమ్మన్నారు' అని ఉమేష్‌ యాదవ్‌ తెలిపాడు.

స్పైక్‌ షూ లేవని ఆడనివ్వలేదు:

స్పైక్‌ షూ లేవని ఆడనివ్వలేదు:

'వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లగానే కోచ్‌ నీ క్రికెట్‌ షూ ఎక్కడ అని అడిగాడు. నా వద్ద సమాధానం లేదు. షూ కూడా లేవు కానీ.. ఆడడానికి వచ్చేశావ్‌ అని అందరి ముందు అవమానకరంగా మాట్లాడాడు. ఆరోజు నేను చాలా బాధపడ్డా. ఇక క్రికెట్‌ను వదిలేద్దామని అనుకున్నా. తర్వాత నా స్నేహితులు ప్రోత్సహించారు. అలాంటి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు. పట్టుదలతో చిన్నచిన్న లీగ్‌ల్లో రోజుకు మూడు మ్యాచ్‌లు ఆడి డబ్బు సంపాదించా. షూ, ప్యాడ్లు, బ్యాట్‌ అన్నీ కొనుక్కొని శిబిరానికి వెళ్లా' అని భారత పేసర్ పేర్కొన్నాడు.

చిన్నపిల్లాడిని చంపేద్దామని చూస్తున్నారా:

చిన్నపిల్లాడిని చంపేద్దామని చూస్తున్నారా:

ఒకసారి దులీప్‌ ట్రోఫీలో రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ విషయం తెలిసి తొలుత భయపడ్డా. దాంతో 'చిన్నపిల్లాడిని చంపేద్దామని చూస్తున్నారా?' అని నా జట్టుతో అన్నా. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు ద్రవిడ్‌, లక్ష్మణ్‌లను కూడా ఔట్ ‌చేశా. దాంతో ఆత్మవిశ్వాసం లభించింది. భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యల గురించి నేను భయపడను, కిందిస్థాయి నుంచి వచ్చిన నాకు ఆ భయం లేదు. ఒకవేళ నేను ఇప్పుడున్న పరిస్థితిని నుంచి దిగజారిపోతే.. ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో తెలుసు. నా ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది' అని ఉమేష్‌ చెప్పాడు.

మామిడికాయలు దొంగలించేవాడిని:

మామిడికాయలు దొంగలించేవాడిని:

'చిన్నతనంలో చాలా అల్లరితనంగా ఉండేవాడిని. రాత్రిపూట అస్సలు నిద్రపోయే వాడిని కాదు. తోటల్లోకి వెళ్లి మామిడి కాయలు దొంగలించేవాడిని. స్నేహితులతో కలిసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్లేవాడిని. అయితే ఆ వయస్సులో కూడా ఏదైనా సాధించాలనే తపన ఉండేది' అని ఉమేష్‌ చిన్ననాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. టీమిండియా తరఫున 46 టెస్టులాడిన ఉమేశ్ యాదవ్.. 144 వికెట్లు పడగొట్టాడు. 75 వన్డేలు ఆడి 106 వికెట్లు తీశాడు. 7 టీ20ల్లో 9 వికెట్లు తీసాడు.

Story first published: Monday, June 8, 2020, 7:24 [IST]
Other articles published on Jun 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X