న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి.. ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది'

Umesh Yadav said I knew my chance will come if I am fit since there are so many matches in the calendar

ముంబై: ఒక క్యాలెండర్‌ ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి. ఫిట్‌గా ఉంటే ఎప్పుడోసారి అవకాశం తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. చాన్స్ వచ్చినప్పుడు రెండు చేతులా ఒడిసిపట్టాలి అని టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అంటున్నాడు. ఉమేశ్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. భారత్ జట్టులోకి వస్తూ.. పోతూ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఉమేశ్ వేగంగా బంతులేస్తున్నా.. లైన్ అండ్ లెంగ్త్ నియంత్రణలో ఉంచుకోలేడనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇది గతం.

కోహ్లీకి గంభీర్‌ మద్దతు.. గంగూలీ సారథ్యంలోనే విదేశాల్లో విజయ పరంపర!!కోహ్లీకి గంభీర్‌ మద్దతు.. గంగూలీ సారథ్యంలోనే విదేశాల్లో విజయ పరంపర!!

దక్షిణాఫ్రికా సిరీస్‌లో 11 వికెట్లు:

దక్షిణాఫ్రికా సిరీస్‌లో 11 వికెట్లు:

కొంతకాలం క్రితం ఉమేశ్ బంతిని పట్టుకునే విధానాన్ని మార్చుకుని అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో మరింత నియంత్రణ సాధించాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో అతడి బౌలింగ్ అమోగం. నిజానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఉమేశ్ తొలుత ఎంపిక కాలేదు. అయితే జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో చోటు దక్కింది. తొలి టెస్టులో అవకాశం రాకపోయినా.. చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

డే/నైట్ టెస్టులో అద్భుత గణాంకాలు:

డే/నైట్ టెస్టులో అద్భుత గణాంకాలు:

దక్షిణాఫ్రికా సిరీస్‌ ప్రదర్శనతో బంగ్లాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టెస్టులో నాలుగు వికెట్లే తీసినా.. కోల్‌కతాలో జరిగిన డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. డే/నైట్ టెస్టులో ఉమేశ్‌ 8/81 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు.

ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది:

ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది:

తన ప్రదర్శనపై తాజాగా ఉమేశ్‌ మాట్లాడుతూ... 'ఒక క్యాలెండర్‌ ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి. ఫిట్‌గా ఉంటే ఎప్పుడోసారి అవకాశం తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. చాన్స్ వచ్చినప్పుడు రెండు చేతులా ఒడిసిపట్టాలి. నేను ఎప్పుడూ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ' అని అన్నాడు.

 పేసర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది:

పేసర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది:

'జట్టులో పేసర్ల మధ్య ప్రస్తుతం ఆరోగ్యకరమైన పోటీ ఉంది. బుమ్రా కూడా వస్తే తుది జట్టులో నలుగురు ఒకేసారి ఆడడం కుదరదు. ఈ పరిస్థితి ఉండడం మంచిదే. బౌలర్లు మరింత కసితో ఆడేందుకు ఇలాంటి పోటీ ఉపకరిస్తుంది. బుమ్రా, షమీ, ఇషాంత్ నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా.కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలంటే కష్టపడాలి. అయితే సహజ నైపుణ్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడాలి' అని పేర్కొన్నాడు.

సిక్సర్ల మోత:

సిక్సర్ల మోత:

ఉమేశ్ బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఉమేశ్ సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఉమేశ్ ఇప్పటి వరకు భారత్ తరపున 45 టెస్టులు (142 వికెట్లు), 75 వన్డేలు (106 వికెట్లు), 7 టీ20 (9 వికెట్లు)లు ఆడాడు.

Story first published: Thursday, November 28, 2019, 12:29 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X