న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ ఎందుకిలా చేశావ్.. వాళ్లనెందుకు తీసుకోలేదు'..??

TWITTER GUTTED OVER KL RAHUL AND DINESH KARTHIK’S OMISSION FROM THE FIRST T20I VERSUS IRELAND

హైదరాబాద్: భారీ అంచనాలతో విదేశీ పర్యటనకు బయల్దేరిన టీమిండియా ఐర్లాండ్‌తో ఆడిన టీ20తో శుభారంభం చేసింది. ఇండియన్ క్రికెట్ అభిమానులను ఈ విజయం సంతృప్తిపరచలేకపోయింది. ఐర్లాండ్‌తో బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ 2018 సీజన్‌లో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్‌లకు తుది జట్టులోకి చోటు కల్పించకపోవడంపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

మనీశ్ పాండే‌కి చోటివ్వడంపై అసంతృప్తి

మనీశ్ పాండే‌కి చోటివ్వడంపై అసంతృప్తి

వారిద్దరిలో ఎవరైనా ఒకర్ని తీసుకోకుండా మనీశ్ పాండే‌కి చోటివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌కి ముందు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించిన దినేశ్ కార్తీక్.. భారత్‌ తరఫున చివరిగా ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడింట్లో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌‌లోనూ 498 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 652 పరుగులతో కేఎల్ రాహుల్‌

ఐపీఎల్‌లో 652 పరుగులతో కేఎల్ రాహుల్‌

కేఎల్ రాహుల్‌ కూడా ఐపీఎల్‌లో అత్యుత్తమంగా రాణించి 652 పరుగులతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకి ఒంటిచేత్తో విజయాల్ని అందించాడు. ఈ ప్రదర్శనతోనే ఇద్దరూ భారత జట్టులోకి ఎంపికగా.. తుది జట్టులో మాత్రం విరాట్ కోహ్లి చోటివ్వకపోవడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్ (74):

రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్ (74):

తొలి టీ20లో రోహిత్ శర్మ 61 బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సలు సహాయంతో (97), శిఖర్ ధావన్ 45 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్సులు బాది (74) దూకుడుగా ఆడి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారంతా తడబడుతూనే మొత్తానికి భారత స్కోరును 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల స్కోరు చేయగలిగారు.

ఐర్లాండ్‌ను 132/9కే పరిమితం చేసి:

ఐర్లాండ్‌ను 132/9కే పరిమితం చేసి:

లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌ను 132/9కే పరిమితం చేసింది. తుది జట్టు ఎంపికపై మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘ఈ మ్యాచ్‌లో అవకాశం దొరకని ఆటగాళ్లకి రెండో టీ20లో ఛాన్సిస్తాం. టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ నిర్ణయం పట్ల ఆటగాళ్లు కూడా సానుకూలంగా ఉన్నారు' అని స్పందించాడు.

Story first published: Thursday, June 28, 2018, 15:26 [IST]
Other articles published on Jun 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X