న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్ డకౌట్: రివ్యూ వేస్ట్ చేశాడంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు

India vs West Indies 2018 : Twitter Lashes Out At KL Rahul For Scoring A Duck And Wasting Review
Twitter bursts out its anger on KL Rahul for scoring a duck and wasting a review

హైదరాబాద్: చాలా రోజుల తర్వాత భారత్‌లో మళ్లీ టెస్టు క్రికెట్ సందడి మొదలైంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో కోహ్లీసేన పలు మార్పులతో బరిలోకి దిగింది.

ముఖ్యంగా సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లకు ఈ సిరిస్ కోసం ఎంపిక చేయలేదు. శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్‌గా యువ ఆటగాడు పృథ్వీషాకు సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ క్రమంలో రాజ్‌కోట్ టెస్టులో పృథ్వీషా ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. భారత్‌ తరుపున టెస్టు ఆడుతున్న 293వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

1
44264
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రెండో అతి చిన్న వయస్కుడి(18 ఏళ్ల 329 రోజులు)గా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే లోకేష్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

మొదటి ఓవర్ ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ ఔట్

మొదటి ఓవర్ ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ ఔట్

గాబ్రియెల్ వేసిన ఆ ఓవర్‌ చివరి బంతికి రాహుల్ ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు. మొదట దీనిని అంపైర్ అవుట్ ఇవ్వగా, రాహుల్ రివ్యూ కోరాడు. అయితే, రిప్లేలో అది ఔట్ అని తేలడంతో భారత్ ఒక రివ్యూ కోల్పోయింది. దీంతో కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.

హాఫ్ సెంచరీతో రాణించి పృథ్వీ షా

రెగ్యూలర్ ఓపెనర్లు మురళీ విజయ్, ధావన్‌ను జట్టులోంచి తప్పించడంతో వారి స్థానంలో బరిలోకి దిగిన రాహుల్, పృథ్వీ షా జట్టుకు శుభారంభం ఇవ్వలేకపోయారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ఓపెనర్ పృథ్వీ షా చక్కటి సమన్వయంతో ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. పృథ్వీ షా 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్‌ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా పృథ్వీ షా అరుదైన చరిత్ర సృష్టించాడు.

టెస్టుల్లో 19వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన పుజారా

ఆ తర్వాత పుజారా కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొదట్లో నెమ్మదిగా ఆడినా.. క్రమంగా వేగం పెంచిన పుజారా 67 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలతో కెరీర్‌లో 19వ హాఫ్ సెంచరీ చేశాడు. రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. షా 70, పుజారా 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Story first published: Thursday, October 4, 2018, 12:38 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X