న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని ఐడియాతోనే కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్: ట్రెంట్ బౌల్ట్

Trent Boult says It was Jimmy Neesham’s idea over his dream delivery to KL Rahul

ముంబై: సహచర ఆటగాడు జిమ్మీ నీషమ్ ఇచ్చిన ఐడియాతోనే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చానని రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే లక్నో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి రెండు బంతుల్లో కేఎల్ రాహుల్, కృష్ణప్ప గౌతమ్‌లను ట్రెంట్ బౌల్ట్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. కేఎల్ రాహుల్‌ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన బౌల్ట్.. ఆ మురసటి బంతికే కృష్ణప్ప గౌతమ్‌ను స్వింగర్‌తో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రాహుల్ ఔటైన తీరు క్రికెట్ అభిమానులను వీపరీతంగా ఆకట్టుకోగా దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

జిమ్మీ నీషమ్ సలహా..

విజయానంతరం మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్ తన డ్రీమ్ డెలవరీపై స్పందించాడు. కొత్త బంతితో వీలైనన్నీ వికెట్లు తీయడమే జట్టులో తన పాత్రని చెప్పుకొచ్చాడు. చివరి ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్‌కు 15 పరుగులు ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసిన యువ పేసర్ కుల్దీప్ సేన్‌ను బౌల్ట్ కొనియాడాడు. 'రాహుల్‌ను ఎలా ఔట్ చేయాలనేదానిపై బ్రేక్ ఫాస్ట్ తర్వాత నిర్ణయం తీసుకున్నాం. ఇది నా సహచర ప్లేయర్ జిమ్మీ నీషమ్ ఐడియా. కేఎల్ రాహుల్‌ను ఔట్ చేయడానికి అతనే ప్రణాళిక రచించాడు. అయితే పూర్తి క్రెడిట్ అతనికి ఇవ్వాలనుకోవడం లేదు(నవ్వుతూ..).

బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలేమో..

బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలేమో..

కొత్త బంతితో వీలైనన్ని వికెట్లు తీయడమే నా రోల్. స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటంతో ఈ మ్యాచ్ నాకు చాలా సులువు అయింది. యువ పేసర్ కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ వంటి డేంజరస్ బౌలర్‌ను నిలవరించడం సులువైన పనికాదు. అతను అద్భుతమైన బంతులతో కట్టడి చేశాడు. మా జట్టులో క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ డోకాలేదు. ఇక నేను నా బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలేమో.'అని ట్రెంట్ బౌల్ట్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. జిమ్మీ నీషమ్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

బంతిని చూడలేదు..

ఈ స్టన్నింగ్ డెలవరీపై స్పందించిన కేఎల్ రాహుల్.. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని చూడలేదని అంగీకరించాడు. రెప్పపాటు సమయంలో బంతి వచ్చి వికెట్లను గీరాటేసిందని, బంతిని చూసుంటే సరైన షాట్ ఆడేవాడినని చెప్పాడు. అదో అద్భుతమైన బంతి అని ట్రెంట్ బౌల్ట్‌ను కొనియాడాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని చెప్పాడు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడంతో పాటు బ్యాటింగ్‌లో ఒక్క మంచి పార్ట్‌నర్‌షిప్ లేకపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పుకొచ్చాడు.

చెలరేగిన చాహల్..

చెలరేగిన చాహల్..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్(36 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లతో 29), రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్, క్వింటన్ డికాక్(32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 39)టాప్ స్కోరర్లుగా నిలవగా.. దీపక్ హుడా(24 బంతుల్లో 3 ఫోర్లతో 25), కృనాల్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లతో 22) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్, కుల్దీప్ సేన్‌కు తలో వికెట్ దక్కింది.

Story first published: Monday, April 11, 2022, 9:51 [IST]
Other articles published on Apr 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X