న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించే ఆలోచనలో ఐసీసీ: దాదా స్పందన ఇదీ!

Too early to say anything on four-day Tests: Sourav Ganguly


హైదరాబాద్:
సంప్రదాయ క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. టీ20లకు ధీటుగా టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు దేశవాళీ తరహాలోనే ఇక టెస్టులను నాలుగు రోజులకు పరిమితి చేసే ఆలోచనలో ఐసీసీ ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ముందు వారి ప్రతిపాదన పరిశీలించాలి. అది ఆచరణలోకి వచ్చాక ఆలోచించాలి. ఇప్పుడే దాని గురించే స్పందిస్తే అది తొందరపాటు అవుతుంది" అని అన్నాడు. 2023-2031 షెడ్యూల్‌ నుంచి ఈ మార్పులు చేయనుంది.

'ఇడియట్' అంటూ భారత నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన డేల్ స్టెయిన్'ఇడియట్' అంటూ భారత నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన డేల్ స్టెయిన్

దీంతో బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో ఆయా బోర్డులకు విరామం దొరుకుతుంది. ఈ సమయంలో మరిన్ని గ్లోబల్‌ ఈవెంట్స్‌ నిర్వహణకు వీలవుతుందని ఐసీసీ ఆలోచన. 2023లో ముగియనున్న ప్రస్తుత భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక (ఎఫ్‌టీపీ) అనంతరం నాలుగు రోజుల మ్యాచ్‌లు అమల్లోకి వచ్చే అవకాశముంది.

క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ద్వైపాక్షిక సిరీస్‌ల సంఖ్య పెంచడంతో పాటు లీగ్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ చేసిన ప్రతిపాదనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు ఇంగ్లండ్‌-ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరిగాయి.

ఇదే ఆఖరి రోజు, 2019 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది: ట్విట్టర్‌లో బుమ్రాఇదే ఆఖరి రోజు, 2019 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది: ట్విట్టర్‌లో బుమ్రా

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్‌ చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు లీగ్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ చేసిన ప్రతిపాదనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2015-2023 మధ్య ఈ నాలుగు రోజుల టెస్టులు జరిగుంటే 335 రోజుల విరామం దొరికేది.

Story first published: Tuesday, December 31, 2019, 18:43 [IST]
Other articles published on Dec 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X