న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

247 పరుగులతో ఆసీస్ ఘన విజయం.. సిరీస్ కైవసం!!

Tom Blundells Century In Vain As Australia Thrash New Zealand To Win 2nd Test, Clinch Series

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్)లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 240 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆస్ట్రేలియా 247 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం​ చేసుకుంది. తొలి టెస్టులో ఆసీస్‌ 296 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అనుమతి లేకుండా విశ్రాంతి.. శ్రేయస్, దూబెలపై చర్యలు?అనుమతి లేకుండా విశ్రాంతి.. శ్రేయస్, దూబెలపై చర్యలు?

ఆదివారం ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 168/5 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. 488 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (8) వికెట్‌ను చేజార్చుకుంది. వెంటనే కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. కాసేపటికి రాస్‌ టేలర్‌ (2) కూడా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్‌ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది.

ఓపెనర్‌ టామ్‌ బ్లండెల్‌ (121)తో కలిసి నికోలస్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే యత్నం చేశాడు. కివీస్ స్కోరు 89 పరుగుల వద్ద ఉండగా నికోలస్‌ (33) పెవిలియన్ చేరాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్‌ ఓటమి చెందగా.. తొమ్మిదో వికెట్‌గా ఔటైన బ్లండెల్‌ మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు ఆడుతున్న బ్లండెల్‌కు ఇది తొలి సెంచరీ. ట్రెంట్‌ బౌల్ట్‌ ఆబ్సెంట్‌ హర్ట్‌గా స్టైకింగ్‌కు రాలేదు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయన్‌ నాలుగు వికెట్లు సాధించగా.. జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ మూడు వికెట్లు తీశాడు. లబూషేన్‌కు వికెట్‌ దక్కింది.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన ఆసీస్‌ ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఓడిపోయినప్పటికీ.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌ ఓటమితో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే ఆసీస్‌ 2-0తో గెలుచుకుంది.

మ్యాచ్‌ ప్రజెంటేషన్‌ అనంతరం.. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అభిమానుల గ్యాలరీ దగ్గరికొచ్చి వారికి ధన్యవాదాలు తెలిపాడు. 'మేము ఓటమికి గురవుతున్నప్పటికీ.. మీరు మాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞులం. ఇలాంటి సన్నివేశం ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందేమోననిఅనుకుఇనేవాణ్ణి. తమపై చూపిస్తున్న ఆదరణకు తప్పకుండా మ్యాచ్‌లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం' విలియమ్సన్‌ ఈ సందర్భంగా అన్నాడు. జనవరి 3న చివరి టెస్ట్ ప్రారంభం కానుంది.

Story first published: Sunday, December 29, 2019, 20:49 [IST]
Other articles published on Dec 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X