న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ పర్యటనలోనూ స్లెడ్జింగ్ చేసి తీరుతాం: కోచ్ లాంగర్

Tim Paine: Australia wont be silent in England ODI series

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో త్వరలో జరగనున్న సిరీస్‌లో తమ క్రికెటర్లు స్లెడ్జింగ్‌కి పాల్పడతారని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ కారణంగా.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం పెరిగి.. చివరికి అది బాల్ టాంపరింగ్‌కి దారి తీసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. స్లెడ్జింగ్‌తో తాము ఎంత నష్టపోయామో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసిరానట్లుంది.

గత దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ట్యాంపరింగ్‌ ఉదంతానికి మూలం స్లెడ్జింగ్‌ అనే విషయాన్ని ఆసీస్‌ క్రికెటర్లు ఇంకా గుర్తించనట్లున్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌తో ప్రపంచం ముందు తల వంచుకున్న ఆసీస్‌ జట్టు కీలక ఆటగాళ్లను దూరం చేసుకొవడమే కాకుండా కోచ్‌ డారెన్‌ లీమన్ సేవలను కోల్పోయింది. అతని స్థానంలో వచ్చిన నూతన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అయినా తమ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకుంటే ..ఇంగ్లాండ్ టూర్‌లో తమ క్రికెటర్లు నోటికి పనిచెప్తారని.. కానీ.. హద్దుల్లోనే ఉంటారని జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు.

'స్లెడ్జింగ్‌ చాలా మంచింది. కానీ శృతిమించకూడదు. స్లెడ్జింగ్‌ అంటే అందరు తిట్టుకోవడం అని భావిస్తారు. కానీ స్లెడ్జింగ్‌ ఓ పరిహాసం. ఆస్ట్రేలియాలో స్లెడ్జింగ్‌ సహజమైన విషయం. నా కూతురితో యూనో (కార్డ్‌ గేమ్‌) ఆడినప్పుడు ఇద్దరం ఒకరికొకరం స్లెడ్జ్‌ చేసుకుంటాం. నేను మా తల్లిదండ్రులతో గోల్ఫ్‌ ఆడినప్పుడు కూడా వారిని నేను. నన్ను వారు స్లెడ్జ్‌ చేస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఆస్ట్రేలియన్స్‌ స్లెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు' అని జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.

ఇక స్టీవ్‌ స్మిత్‌ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన టీమ్‌ పెయిన్‌ సైతం మైదానంలో నిశబ్దంగా ఉండమని, మర్యాదకరమైన స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తామని తెలిపాడు. అయితే కేవలం పరిహాసమే ఆడుతాం తప్పా.. వ్యక్తిగత దూషణలకు దిగమని చెప్పుకొచ్చాడు. ఇక లాంగర్‌ కామెంట్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 13 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా జట్టు ఆడనుంది.

Story first published: Thursday, June 7, 2018, 8:38 [IST]
Other articles published on Jun 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X