న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2012 వరకు ఎవరూ లెక్క చేయలేదు.. ప్రత్యర్థి కళ్లలో భయం చూడాలనుకున్నా: కోహ్లీ

Till 2012, I didn’t see fear or respect for me in oppositions eye says Virat Kohli

ఢిల్లీ: ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ. ఇప్పుడు కోహ్లీ ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌. కోహ్లీ బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. అతడు క్రీజులో ఉన్నంతసేపు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే కెరీర్ తొలి రోజుల్లో 2012 వరకు ప్రత్యర్థి కళ్లలో భయం, గౌరవం ఉండేవి కావు. తననెవరూ లెక్క చేసేవారు కాదని కోహ్లీ అంటున్నాడు.

<strong>వైరల్ వీడియో.. పాకిస్థాన్ జట్టులో కోహ్లీ, ధావన్!!</strong>వైరల్ వీడియో.. పాకిస్థాన్ జట్టులో కోహ్లీ, ధావన్!!

సాధారణ ఆటగాడిని:

సాధారణ ఆటగాడిని:

శనివారం ఒక స్పోర్ట్స్ వెబ్ షోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోహ్లీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. 'కెరీర్ ప్రారంభంలో నన్ను చూసి ప్రత్యర్థి జట్లు భయపడ్డ, గౌరవించిన సందర్భాలు లేవు. ఎందుకంటే 2012కు ముందు నేనో సాధారణ ఆటగాడిని. ప్రత్యర్థి జట్లు అసలు నా గురించి ఆలోచించేవి కావు. ఇలా వచ్చి అలా వెళతాడనే భావనలో ఉండేవి. బౌలర్లు కూడా తేలిగ్గానే తీసుకునేవారు. కానీ నేనలా ఉండాలని కోరుకోలేదు. క్రీజులోకి వస్తుంటే ఇతన్ని త్వరగా అవుట్‌ చేయాలి.. లేకుంటే మ్యాచ్ ఓడిపోతామనే భయం ప్రత్యర్థుల్లో ఉండాలనుకున్నా' అని కోహ్లీ తెలిపాడు.

ఫిట్‌నెస్‌ పూర్తిగా మార్చివేసింది:

ఫిట్‌నెస్‌ పూర్తిగా మార్చివేసింది:

'2012 ఆసీస్‌ పర్యటన తర్వాత ఆ జట్టుకు, మాకున్న తేడా స్పష్టంగా తెలిసింది. దీంతో శిక్షణ, డైటింగ్‌, ఆటతీరును మార్చుకోకుంటే అత్యుత్తమ స్థాయిని కనబర్చలేమని అర్థమైంది. ఆ దిశగా ఆడే ప్రయత్నం చేశా. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ నన్ను పూర్తిగా మార్చివేసింది. అలాగే ఆడే తీరు కూడా మారింది. ప్రపంచక్‌పలో వరుసగా మ్యాచులు ఆడినా అలిసిపోలేదు. ప్రతీ మ్యాచ్‌కు నా ఎనర్జీ స్థాయి 120 శాతంగా ఉంది. ఇదంతా ఫిట్‌నెస్‌ వల్లే సాధ్యమయింది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

గణితంలో 100/3:

గణితంలో 100/3:

'చదువుకునే రోజుల్లో గణితం అంటే చాలా భయం. ఆ సమయంలో గణితంలో పడిన కష్టం క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడూ పడలేదు. 100 మార్కులకు కేవలం 3 మార్కులే వచ్చాయంటే అర్ధం చేసుకోండి. ఎలాగైనా గణితంలో పాస్ మార్కులు వస్తే చాలనుకున్నా. దానికోసం పడ్డ కష్టం అంతాఇంతా కాదు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, September 8, 2019, 14:30 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X