న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rishabh Pant: పంత్ బ్యాటింగ్‌లో ప్రధాన సమస్యలు ఈ మూడే.. ఇవి కరెక్ట్ చేసుకుంటే..

three main problems in Rishabh Pant batting

ప్రస్తుతం టీమిండియా అభిమానులకు కొరకరాని కొయ్యలా మారిన సమస్య రిషభ్ పంత్ ఫామ్. టెస్టు క్రికెట్‌లో అదరగొట్టిన అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై తొలి వన్డే సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత మళ్లీ కథ అడ్డం తిరిగింది. పొట్టి ఫార్మాట్‌లో దారుణంగా విఫలమయ్యాడు.

దీంతో టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతని స్థానంలో దినేష్ కార్తీక్‌కు ప్రాధాన్యం దక్కింది. ఇప్పుడు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా ఈ రేసులో చేరారు. వీరికితోడు కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చెయ్యగలడు. కొన్ని మ్యాచుల్లో అతను టీమిండియాకు కీపర్‌గా కూడా సేవలందించాడు. అంటే పంత్ ఆడకపోతే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది రెడీగా ఉన్నారన్నమాట. మరి అసలు రిషభ్ పంత్ బ్యాటింగ్‌లో కనబడుతున్న ప్రధాన సమస్యలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే..

రియాక్షన్ వేగం

రియాక్షన్ వేగం

ఇటీవలి కాలంలో పంత్ బ్యాటింగ్ గమనిస్తే అర్థమయ్యే విషయం అతని రియాక్షన్ వేగం. టెస్టుల్లో అయితే బౌలర్లు ఒక సెట్ లెంగ్త్ పెట్టుకొని అలాగే బౌలింగ్ చేస్తారు. అలాంటప్పుడు రియాక్షన్ కొంచెం అటూ ఇటూ అయినా పర్లేదు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అలాకాదు. బంతి బంతికీ వేరియేషన్స్ చూపిస్తుంటారు బౌలర్లు. అలాంటి సమయంలో రియాక్షన్ ఏమాత్రం నెమ్మదించినా వికెట్ పోవడం గ్యారంటీ. న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్ అలాగే అవుటయ్యాడు. ఇలా రియాక్షన్ నెమ్మదించడం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా పెద్ద సమస్యగా మారుతుంది.

బ్యాలెన్స్ లేని షాట్లు

బ్యాలెన్స్ లేని షాట్లు

రిషభ్ పంత్ మరో ప్రధాన సమస్య. అనవసర షాట్లకు పోవడం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ షాట్లు ఆడలేరు. ఈ విషయం పంత్ అర్థం చేసుకోవాలి. కొన్ని డాట్స్ ఆడగానే ఒత్తిడికి లోనవడం, దాన్ని తగ్గించుకోవడానికి అనవసరంగా భారీ షాట్లకు ప్రయత్నించడం అతనికి అలవాటుగా మారింది. కివీస్‌తో జరిగిన రెండో టీ20లో లేని షాట్‌ కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడతను. ముఖ్యంగా స్లాగ్ చేసే సమయంలో ఏమాత్రం బాడీ బ్యాలెన్స్ మెయిన్‌టైన్ చెయ్యలేకపోతున్నాడు. దీంతో బంతిని బలంగా బాదాల్సి వస్తుంది. అది ప్రతిసారీ కుదరదు. కాబట్టి తన టైమింగ్‌పై శ్రమించి, ఈ అనవసర షాట్లు తగ్గించుకుంటే మంచిది.

షాట్ సెలెక్షన్

షాట్ సెలెక్షన్

వరుసగా విఫలం అవుతున్న పంత్‌ను చూసి మాజీలు, విశ్లేషకులు ఎక్కువగా ఎత్తి చూపుతున్న విషయం పంత్ షాట్ సెలెక్షన్. పరిస్థితికి తగినట్లు ఆడటం తెలియని పంత్.. ఏ బంతికి ఎలాంటి షాట్ ఆడాలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. టెస్టులు అతని ఆటతీరుకు సరిపోవడంతో ఈ సమస్య పెద్దగా ఎవరి కంటా పడలేదు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ విషయం తేటతెల్లం అయిపోయింది. కొంచెం ఒత్తిడికి గురైనా క్రీజును వదిలి ముందుకు దూకడం, లేదంటే బంతిని ఆఫ్‌సైడ్ గాల్లోకి లేపడం అతనికి అలవాటైపోయింది. ఇది ఇలాగే కొనసాగితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ కెరీర్‌కు గండి పడినట్లే.

Story first published: Tuesday, November 29, 2022, 13:51 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X