న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'.. వార్న్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన బంతి!!

This day, 27 years ago: When Shane Warne left cricketing world astonished with ball-of-the-century

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేటి బ్యాట్స్‌మన్‌లను సైతం సునాయాసంగా బోల్తా కొట్టించి.. 'స్పిన్‌ మాంత్రికుడు' అని పేరు తెచ్చుకున్నాడు. ఈ మాయాజాలంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్ ‌(708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భాగంగా వార్న్‌ వేసిన ఒక బంతి ఇప్పటికీ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'గానే పిలవబడుతోంది.

రోహిత్‌ కంటే కోహ్లీనే నిలకడైన ఆటగాడు: బ్రాడ్‌ హాగ్‌రోహిత్‌ కంటే కోహ్లీనే నిలకడైన ఆటగాడు: బ్రాడ్‌ హాగ్‌

గాటింగ్‌ను బోల్తా కొట్టించిన వార్న్‌:

గాటింగ్‌ను బోల్తా కొట్టించిన వార్న్‌:

1993లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో షేన్‌ వార్న్‌ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. ఆ టెస్టు మ్యాచ్‌ జూన్‌ 3వ తేదీన ఆరంభం కాగా.. రెండో రోజు ఆట (జూన్‌ 4వ తేదీన)లో ఇంగ్లండ్‌ దిగ్గజ ఆటగాడు మైక్‌ గాటింగ్‌ను వార్న్‌ బోల్తా కొట్టించాడు. ఆ బంతే వార్న్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. బంతిని నేరుగా గాటింగ్‌ కాళ్లకు ముందు అవుట్‌సైడ్‌ లెగ్‌స్టంప్‌పై వేసి ఆఫ్‌ వికెట్‌ను పడగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్‌ అంచనా వేసేలోపే.. ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఇక్కడ ఏం జరిగిందో తెలియక గాటింగ్‌ షాక్‌ అయ్యాడు.

భారత్‌పై అరంగేట్రం:

భారత్‌పై అరంగేట్రం:

ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో షేన్‌ వార్న్‌దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు పడగొట్టి ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. వార్న్‌ కెరీర్‌కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే మ్యాచ్‌. 1992లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన వార్న్‌.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజంలా మారాడు. ఎందరో యువతకు వార్న్‌ స్ఫూర్తిగా నిలిచాడు.

తొలి వికెట్‌గా హ్యూజ్:

తొలి వికెట్‌గా హ్యూజ్:

ఆ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ ఆరంభం బాగానే ఉన్నా ఆపై వరుస వికెట్లు కోల్పోయింది. 68 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో మార్క్‌ టేలర్‌ సెంచరీ, స్లేటర్‌ హాఫ్‌ సెంచరీ చేయడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 289 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటను ఇంగ్లండ్ ఆరంభించగా.. మైక్‌‌ అథర్టన్‌,‌ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌ క్రీజులోకి వచ్చారు. అథర్టన్‌ను తొలి వికెట్‌గా హ్యూజ్‌ ఔట్‌ చేసిన తర్వాత ఇంగ్లండ్‌ పతనం ఆరంభమైంది.

ఇప్పటికీ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ':

ఇప్పటికీ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ':

తొలి వికెట్‌ పడ్డ తర్వాత గ్రాహం గూచ్‌కు మైక్‌ గాటింగ్‌ జత కలిశాడు. అప్పటికే గాటింగ్‌ దిగ్గజ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆసీస్‌ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌.. లెగ్‌ స్పిన్నర్ అయిన వార్న్‌ చేతికి బంతినిచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని వార్న్‌ వమ్ము చేయలేదు. గాటింగ్‌ను ఒక వైవిధ్యమైన బంతికి ఔట్‌ చేసాడు. ఆ తర్వాత మరో మూడు వికెట్లు పడగొట్టాడు. వార్న్‌ తన కెరీర్‌లో ఎన్ని అద్భుతమైన బంతులు వేసినా.. ఇప్పటికీ గాటింగ్‌కు వేసిన బంతే 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా నిలిచింది.

Story first published: Thursday, June 4, 2020, 19:56 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X