న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకు నిర్ణయం తీసుకోవద్దు?: ‘నోబాల్‌ అంపైర్‌’ అంఫైర్‌పై గిల్‌క్రిస్ట్ అభిప్రాయమిది!

IPL 2020 : Third Umpire Should Be Able To Spot No-Balls Says Adam Gilchrist || Oneindia Telugu
Third umpire should be able to spot no-balls: Gilchrist

హైదరాబాద్: ఐపీఎల్‌లో సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు థర్డ్‌ అంపైరే నో బాల్స్‌ను గుర్తించాల్సిన అవసరముందని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో అంపైరింగ్‌ తప్పిదాలు వార్తల్లో నిలిచాయి. అనుభవ అంపైర్లు క్రీజులో ఉన్నా కూడా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు వచ్చాయి.

బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై పేసర్‌ లసిత్ మలింగ ఇన్నింగ్స్‌ ఆఖరి బంతిని నోబాల్‌గా వేసినా.. అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి మ్యాచ్‌ ఓడాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లోనే విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో 'నోబాల్‌ అంపైర్‌'ను తీసుకురావాలని ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ కొత్త ప్రతిపాదన చేసింది.

KPL fixing: ఇద్దరు బళ్లారి టస్కర్స్ ఆటగాళ్లను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులుKPL fixing: ఇద్దరు బళ్లారి టస్కర్స్ ఆటగాళ్లను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ

గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ

దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ "‘ఫీల్డ్‌ అంపైర్‌ అన్నీ వైపులా చూడాలంటే చాలా కష్టం. గతేడాది రీప్లే ఉండడంతో అది నోబాల్‌గా తేలింది. దాన్ని అలాగే అమలు చేయాలి. నాలుగో అంపైర్‌ అవసరం ఉన్నా లేకున్నా.. మూడో అంపైర్‌ రీప్లే చూసి వెంటనే నాటౌట్‌గా ఎందుకు నిర్ణయం తీసుకోవద్దు?" అని గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు.

అత్యుత్తమ విధానమని నేను భావిస్తున్నా

అత్యుత్తమ విధానమని నేను భావిస్తున్నా

"ఇదే అత్యుత్తమ విధానమని నేను భావిస్తున్నా. ఒకవేళ నాలుగో అంపైర్‌ ఉండి సరైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆమోదిస్తాను. అయితే, ప్రత్యేక(నోబాల్స్‌) అంపైర్‌ వల్ల ఇలాంటి ఘటనలు తగ్గుతాయా అంటే తగ్గవు. ఎందుకంటే వారు అప్పటికప్పు

ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్లతో కలిసి పనిచేస్తాడు

ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్లతో కలిసి పనిచేస్తాడు

అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. 'మ్యాచ్‌ల్లో ఎలాంటి తప్పుడు నిర్ణయాలూ వెలువడకుండా చూడాలనుకుంటున్నాం. వచ్చే సీజన్‌లో రెగ్యులర్‌ అంపైర్లతో పాటు నోబాల్స్‌ను పర్యవేక్షించేందుకు మరో ప్రత్యేక అంపైర్‌ కూడా కనిపిస్తాడు. ప్రత్యేక అంపైర్‌ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్లతో కలిసి పనిచేస్తాడు. ఈ ఆలోచన కాస్త విచిత్రంగా కనిపించినా.. మా మధ్య దీనిపై చర్చ జరిగింది' అని పాలక మండలి సభ్యుడు ఒకడు తెలిపారు.

Story first published: Thursday, November 7, 2019, 12:29 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X