న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20 ఓటమి ఎఫెక్ట్: ఖలీల్ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్?, మార్పులు తప్పవన్న రోహిత్

 There will be changes in our approach: Rohit Sharma ahead of 2nd T20I vs Bangladesh

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టీ20లో స్వల్ప మార్పులు చేయనున్నట్లు టీమిండియా స్టాండ్-ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రాజ్‌కోట్‌ పిచ్ ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నట్లు రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

గత ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు, ఒక మీడియం పేసర్ శివన్ దూబేతో పాటు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగినప్పటికీ ఏడు వికెట్లు తేడాతో ఓడిపోయింది. దీంతో రెండో టీ20లో టీమిండియా బౌలింగ్‌తో మార్పులు చేయనున్నారు.

గేల్, ఏబీ, రషీద్‌తో టోర్నీ కళ కళ: మన్షి సూపర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ ఇదే!గేల్, ఏబీ, రషీద్‌తో టోర్నీ కళ కళ: మన్షి సూపర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ ఇదే!

దీనిపై రెండో టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ "మా బ్యాటింగ్ బాగుంది. కాబట్టి బ్యాటింగ్‌లో మనం చేయాల్సిన మార్పులు ఏమీ లేవు. కానీ, పిచ్‌ను విశ్లేషించి... దాని ఆధారంగా జట్టుగా ఏమి చేయగలమో అదే చేస్తాము" అని పేర్కొన్నాడు.

ఖలీల్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌‌

దీంతో రెండో టీ20లో ఖలీల్ అహ్మాద్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌‌కు చోటు దక్కుతుందేమోనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పిచ్ పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయని రోహిత్ శర్మ సూచాయగా చెప్పాడు. "పేస్ బౌలింగ్ కాంబినేషన్‌తో గత మ్యాచ్‌లో ఆడాం. ఢిల్లీ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అన్నాడు.

బౌలింగ్ లైనప్‌‌లో మార్పులు

బౌలింగ్ లైనప్‌‌లో మార్పులు

"ఈ రోజు పిచ్ చూస్తాము. ఈ క్రమంలో మన బౌలింగ్ లైనప్‌లో ఏమి చేయాలో ఆలోచిస్తాము. పిచ్ బాగుంది. రాజ్‌కోట్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్ చేయడానికి మంచి ట్రాక్. అయితే, ఇది బౌలర్లకు కూడా కొంత సహాయం చేస్తుంది. ఇది తప్పకుండా మంచి పిచ్ అవుతుంది. ఢిల్లీలో మీరు చూసినదానికంటే ఇది మంచి పిచ్ అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా" అని రోహిత్ అన్నాడు.

అరుదైన మైలురాయి: రాజ్‌కోట్ టీ20తో ఎలైట్ జాబితాలోకి రోహిత్ శర్మ

1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్

తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

రాజ్ కోట్ వేదికగా రెండో టీ20

రాజ్ కోట్ వేదికగా రెండో టీ20

ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

Story first published: Wednesday, November 6, 2019, 17:29 [IST]
Other articles published on Nov 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X