Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన మైలురాయి: రాజ్‌కోట్ టీ20తో ఎలైట్ జాబితాలోకి రోహిత్ శర్మ

Rohit Sharma on the verge of a major milestone in Rajkot T20I

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఎలైట్ జాబితాలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు రాజ్‌కోట్ వేదిక కానుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

రోహిత్ శర్మకు ఇది 100వ టీ20. దీంతో భారత్ తరుపున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించనున్నాడు. ఈ సిరిస్‌లో భాగంగా గత ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(98 టీ20లు) రికార్డుని అధిగమించాడు.

అగ్రస్థానంలో షోయబ్ మాలిక్

అగ్రస్థానంలో షోయబ్ మాలిక్

కాగా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, మహిళల క్రికెట్‌లో భారత్ నుంచి హర్మన్ ప్రీత్ కౌర్(100) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. బంగ్లాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్

పనిభారం కారణంగా బంగ్లా సిరిస్ నుంచి సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తొలి టీ20లో రోహిత్ శర్మ 9 పరుగులకే ఔటైనప్పటికీ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీని అధిగమించాడు. టీ20ల్లో రోహిత్ శర్మ(2,452) పరుగులు చేశాడు. రోహిత్‌తో పోలిస్తే కోహ్లీ కేవలం 2 పరుగుల మాత్రమే వెనుకంజలో ఉన్నాడు.

2 పరుగుల వెనుకంజలో కోహ్లీ

2 పరుగుల వెనుకంజలో కోహ్లీ

ఆ తర్వాత మార్టిన్ గుప్టిల్(2,326), షోయబ్ మాలిక్(2,63), బ్రెండన్ మెక్‌కల్లమ్(2,140) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం.

రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20

రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20

అంతేకాదు ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 సిరిస్ ఇదే కావడం విశేషం. తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 7న రాజ్ కోట్ వేదికగా జరగనుంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

Story first published: Wednesday, November 6, 2019, 15:50 [IST]
Other articles published on Nov 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+