న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యాకు తగ్గ క్వాలిటీస్ మరెవ్వరిలోనూ లేవు: ఎమ్మెస్కే

There is no one matching Hardik Pandya’s abilities in India: MSK Prasad

హైదరాబాద్: నవంబరు నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు, ఆస్ట్రేలియా టీ20, టెస్టు సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ.. దాదాపు అన్ని పరిమితి ఓవర్ల మ్యాచ్‌లలోనూ ఆడుతున్నాడు. కానీ, టీ20 సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని తప్పించి సెలక్షన్‌ కమిటీ కఠిన నిర్ణయమే తీసుకుంది.

ఆసీస్‌ పర్యటనలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌

ఆసీస్‌ పర్యటనలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌

ఇదిలా ఉండగా ఈ మూడు సిరీస్‌లకు సంబంధించిన జట్టులో ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యకు కూడా ఎక్కడా చోటు కల్పించలేదు. విండీస్‌తో టీ20 సిరీస్‌ను మినహాయిస్తే.. కఠినమైన ఆసీస్‌ పర్యటనలో జట్టుకు పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌ లేకపోవడం కూడా భారీ లోటే. ఈ విషయం గురించి సెలక్షన్‌ కమిటీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడాడు.

అతని స్థాయిలో ప్రదర్శన ఏ ఆటగాడిలోనూ

అతని స్థాయిలో ప్రదర్శన ఏ ఆటగాడిలోనూ

హార్ధిక్‌ పాండ్య స్థాయిలో సామర్థ్యం గల ఓ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌ మాకు కనిపించలేదు. పాండ్య బౌలింగ్‌తో పాటు, బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. కానీ ఈ సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో అతని స్థాయిలో ప్రదర్శన చేసే ఆల్‌రౌండర్‌ భారత జట్టులో ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. అతని సామర్థ్యాలకు సమానంగా ఉన్న ఆటగాడు దొరకడం కూడా ప్రస్తుతం కష్టమే. ఆ కారణం చేతనే జట్టులో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయలేకపోయాం.

వెన్నునొప్పితో మైదానాన్ని వీడిన పాండ్య

వెన్నునొప్పితో మైదానాన్ని వీడిన పాండ్య

అయితే బంతితో రాణిస్తున్న భువనేశ్వర్‌ కుమార్‌ టెస్టు సిరీస్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటగలడని ఆశిస్తున్నాం. భువీ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన పట్ల మాకు విశ్వాసం ఉందని తెలిపాడు. సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్ధిక్‌ పాండ్య వెన్నునొప్పితో మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాండ్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతని గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో సమాచారం అందుబాటులో లేదు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, అయ్యర్‌, మనీష్‌ పాండే, దినేష్‌ కార్తీక్‌, పంత్‌ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రునాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌, బుమ్రా, ఉమేష్‌, ఖలీల్‌ అహ్మద్‌.

Story first published: Sunday, October 28, 2018, 15:10 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X