న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ధోనీ లక్ష విరాళం.. అది తెలుసుకోకుండా సిగ్గులేని ప్రజలు..

The reason why MS Dhoni donated only Rs 1 lakh to the daily wage workers in Pune

హైదరాబాద్: కరోనా వైరస్‌పై పోరాడేందుకు యావత్ క్రీడాలోకం ముందుకొచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం దొరకని అభాగ్యులను ఆదుకునేందుకు తమ వంతు సాయాన్ని ప్రకటించింది.

సచిన్, గంగూలీ..

సచిన్, గంగూలీ..

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చెరో రూ. 50 లక్షలు.. సింధు రూ.10 లక్షలు, బజరంగ్ పూనియా తన 6 నెలల జీతం, సానియా మీర్జా భోజన సాయం, పఠాన్ బ్రదర్స్ మాస్క్‌ల వితరణ ఇలా తమకు తోచిన విధానంలో భారత స్టార్ ప్లేయర్లు సాయం చేస్తున్నారు. శిఖర్ ధావన్ కూడా పీఎం రీలీఫ్ ఫండ్‌కు తనకు తోచిన సాయం చేశానని ఇతరులు కూడా చేయాలని విజ్ఞప్తి చేశాడు.

ధోనీ లక్ష సాయం..

ధోనీ లక్ష సాయం..

ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ‌కు లక్షరూపాయల విరాళాన్ని ప్రకటించాడు. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పూణేలోని పేదలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నా ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ మాధ‌వ్‌ ఫౌండేషన్ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ధోని లక్ష రూపాయలు విరాళం ఇవ్వగానే మిగతా వారు స్పందించారు. ఇప్పటికే పూణేలోని నిరుపేద ప్రజలను గుర్తించిన ఫౌండేషన్.. నిత్యవసర వస్తువులైన సబ్బులు, బియ్యం, గోధుమపిండి, నూనె త‌దిత‌ర వ‌స్తువుల‌ను ఒక ప్యాకెట్లో వారికి అందజేస్తుంది.

ధోనీ తగునా.. ట్రోలింగ్..

అయితే సుమారు 800 కోట్ల నికర విలువ(మొత్తం ఆస్తుల నుంచి అప్పులు తీసివేయగా వచ్చే విలువ) కలిగి ఉన్న ధోనీ కేవలం రూ. లక్ష రూపాయలు ఇవ్వడం ఏంటని ఈ జార్ఖండ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగారు.

సిగ్గులేని ప్రజలు..

సిగ్గులేని ప్రజలు..

అయితే ధోనీ లక్ష రూపాయలే సాయం చేయడానికి గల కారణాన్ని ఇండియా టూడే ఎడిటర్ విక్రాంత్ గుప్తా తెలిపాడు. ధోనీపై ట్రోలింగ్ దిగిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.‘లక్ష రూపాయలే సాయం చేశాడని సిగ్గులేని ప్రజలు ధోనీని విమర్శిస్తున్నారు. సదరు ఫండ్ రైసింగ్ సంస్థ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ధోనీ లక్ష రూపాయలు సాయం చేశాడు. సాయం చేశానని చెప్పుకునే వ్యక్తి కాదు. నాకు తెలిసి ఇప్పటికే అతను విరాళం ఇవ్వచ్చు. 'అని ట్వీట్ చేశారు.

Story first published: Friday, March 27, 2020, 17:14 [IST]
Other articles published on Mar 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X