న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్ క్రికెటర్‌!!

Tharanga Paranavitana Retires From International Cricket

కొలంబో: శ్రీలంక క్రికెట‌ర్ త‌రంగ ప‌ర‌ణ‌విత‌న అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. తాను అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు లంక బోర్డుకు 38 ఏళ్ల పరణవితన స్వయంగా వెల్లడించాడు. పరణవితన లంక తరఫున 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. రెండు సెంచ‌రీలు, 11 అర్ధ సెంచ‌రీల‌తో మొత్తం 1,792 ప‌రుగులు చేశాడు.

2009లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో త‌రంగ ప‌ర‌ణ‌విత‌న టెస్ట్ క్రికెట్‌లో ప్ర‌వేశించాడు. త‌రంగ త‌న రెండు సెంచ‌రీల‌ను 2010లో భార‌త్‌పై న‌మోదు చేశాడు. 2012లో త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడాడు. ఇన్ని రోజులు దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. శ్రీలంక ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ప‌ర‌ణ‌విత‌ననే. దేశీయ క్రికెట్‌లో 12,522 పరుగులు చేశాడు. కరోనా విరామం తర్వాత ప్రారంభమయిన దేశీయ సీజన్‌లో హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

త‌రంగ ప‌ర‌ణ‌విత‌న 2000ల చివరలో మూడంకెల స్కోర్లు తరచూ చేయడంతో జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2007-08 దేశీయ క్రికెట్‌లో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ తరఫున లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్‌ కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. 236 పరుగులు చేసి అందరినీ ఆకర్షించాడు. దీంతో శ్రీలంక ఏ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో అదరగొట్టడంతో మాజీ కోచ్ చండికా హతురుసింగ్ అతన్ని జాతీయ జట్టులోకి తీసుకున్నాడు.

చండికా హతురుసింగ్ అవకాశం ఇవ్వడంతో 2009 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో త‌రంగ ప‌ర‌ణ‌విత‌న టెస్ట్ క్రికెట్‌లో ప్ర‌వేశించాడు. 2010లో భారత్‌తో జరిగిన మ్యాచులలో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత అతను అర్ధ సెంచరీలు చేసినా.. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. దీంతో 2012 నవంబర్లో శ్రీలంక తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. లంక తరఫున టెస్ట్ క్రికెట్‌లో ఆడినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

బార్సిలోనాకు బైబై.. ఇక మెస్సీ దారెటు!!బార్సిలోనాకు బైబై.. ఇక మెస్సీ దారెటు!!

Story first published: Friday, August 28, 2020, 13:32 [IST]
Other articles published on Aug 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X