న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఈ జట్టులో వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు సీనియర్లు షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, మేఘన సింగ్ చోటు దక్కించుకున్నారు.
#TeamIndia squad:
— BCCI Women (@BCCIWomen) December 2, 2022
Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Yastika Bhatia (wk), Jemimah Rodrigues, Deepti Sharma, Radha Yadav, Rajeshwari Gayakwad, Renuka Singh Thakur, Meghna Singh, Anjali Sarvani, Devika Vaidya, S Meghana, Richa Ghosh (wk), Harleen Deol.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి ఈ జట్టుకు ఎంపికైంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణికి తొలిసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో అంజలి శర్వాణి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
టీమిండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కుటుంబసభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది. ఆమె ఎంపిక పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.
భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా(కీపర్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శ్రావణి, దేవిక విద్య, ఎస్ మేఘణా సింగ్, అంజలి శ్రావణి, దేవిక వైద్య, ఎస్ మేఘణ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్