న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు విశ్రాంతి, ధావన్ ఔట్!: విండిస్‌తో వన్డే, టీ20 సిరిస్‌కు రేపు జట్ల ఎంపిక!

India vs West Indies 2019: Shikhar Dhawan May Not Be Selected For WI Tour,Here Is The Reason !
Team for WI series: Rohit Sharmas workload to be discussed, out-of-form Shikhar Dhawan may be on trial


హైదరాబాద్:
వెస్టిండిస్‌తో వన్డే, టీ20 సిరిస్‌లకు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించనున్నారు. ఈ మేరకు చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ గురువారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో సమావేశం కానుంది. ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన సెంట్రల్ జోన్ సెలెక్టర్ గగన్ ఖోడాకు ఇదే చివరి సమావేశం కానుంది.

ఎందుకంటే అతడి నాలుగేళ్ల పదవి కాలం ముగియనుంది. ఈ సమావేశంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పని భారంతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ పని భారాన్ని సమీక్షించనున్నారు. ఈ కేలండర్ ఇయర్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే 25 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. కోహ్లీతో పోలిస్తే మూడు వన్డేలు, నాలుగు టీ20లు అదనం.

గణాంకాలే చెబుతున్నాయి: ఈ దశాబ్దం టీమిండియాదేనని!గణాంకాలే చెబుతున్నాయి: ఈ దశాబ్దం టీమిండియాదేనని!

ఇప్పటికే కోహ్లీకి రెండు సార్లు విశ్రాంతి

ఇప్పటికే కోహ్లీకి రెండు సార్లు విశ్రాంతి

అంతేకాదు ఈ కేలండర్ ఇయర్‌లో సెలక్టర్లు విరాట్ కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు సార్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో వెస్టిండిస్ పర్యటన నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన శిఖర్ ధావన్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

నిరాశ పరిచిన ధావన్

నిరాశ పరిచిన ధావన్

బంగ్లాతో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో ధావన్(41, 31, 19) పరుగులతో నిరాశపరిచాడు. దీంతో వెస్టిండిస్ పర్యటన నుంచి ధావన్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ఓపెనర్‌గా టెస్టు క్రికెట్‌లో రాణిస్తోన్న మయాంక్ అగర్వాల్‌ వైపు సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి తోడు మూడో ఓపెనర్ ఆలోచన్ చేస్తే గనుక కేఎల్ రాహుల్‌కు చోటు దక్కొచ్చు.

ధోనికి అవకాశం

ధోనికి అవకాశం

వెస్టిండిస్‌తో సిరిస్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అవకాశం ఇవ్చొచ్చు. ఎందుకంటే రిషభ్‌ పంత్‌ బ్యాటు, గ్లోవ్స్‌తో విఫలమవుతున్నాడు. ఇక, బంగ్లాతో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కని సంజు శాంసన్‌కు ఈ సారైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన వివరాలు:

భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన వివరాలు:

మూడు టీ20లు:

తొలి టీ20 - డిసెంబర్‌ 6, శుక్రవారం (ముంబై)

రెండో టీ20 - డిసెంబర్‌ 8, ఆదివారం (తిరువనంతపురం)

మూడో టీ20- డిసెంబర్‌ 11, బుధవారం (హైదరాబాద్‌)

మూడు వన్డేలు:

తొలి వన్డే - డిసెంబర్‌ 15, ఆదివారం (చెన్నై)

రెండో వన్డే - డిసెంబర్‌ 18, బుధవారం (విశాఖపట్నం)

మూడో వన్డే - డిసెంబర్‌ 22, ఆదివారం (కటక్‌)

Story first published: Wednesday, November 20, 2019, 15:15 [IST]
Other articles published on Nov 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X