న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓపిగ్గా ఉండటమే మా విజయానికి కారణం'

By Nageshwara Rao
Tamim Iqbal Says Patience is the Key on West Indian Wickets After Winning ODI Series

హైదరాబాద్: ఆతిథ్య వెస్టిండిస్‌పై మూడు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను 2-1తేడాతో గెలవడంపై బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తమీమ్‌ ఇక్బాల్‌(103) సెంచరీతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

1
43703

వెస్టిండిస్‌పై సిరీస్‌ సాధించడంలో ఓపిక అనేది కీలక పాత్ర పోషించిందని మ్యాచ్ అనంతరం తమీమ్‌ ఇక్బాల్‌ అన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "టెస్టు సిరీస్‌లో మేము గొప్పగా ఆడలేదు.. కానీ మంచి ప్రాక్టీస్‌ లభించింది. అది వన్డే సిరీస్‌కు ఎంతగానో ఉపయోగపడిందనే అనుకుంటున్నా" అని అన్నాడు.

ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడితే పరుగులు

ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడితే పరుగులు

"సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడితే పరుగులు సాధించడం కష్టం కాదు. అదే ప‍్రయోగాన్ని వన్డే సిరీస్‌లో అవలంభించాం. మా జట్టు మేనేజ్‌మెంట్‌ నన్ను సుదీర్ఘమైన బ్యాటింగ్‌ చేయాలని ఆదేశించింది. ఆ విషయంలో నేను సక్సెస్‌ అయ్యా. వెస్టిండీస్‌లో వికెట్‌పై రాణించడం ఎప్పుడూ సులభం కాదు. ఇక్కడ కావాల్సింది ఓపిక" అని ఇక్బాల్ పేర్కొన్నాడు.

అందుకు కారణం ఓపిగ్గా ఉండటమే

అందుకు కారణం ఓపిగ్గా ఉండటమే

"నేను భారీ పరుగులు చేశానంటే అందుకు కారణం ఓపిగ్గా ఉండటమే. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఓపిక అనేది కీలక పాత్ర పోషించదని కచ్చితంగా చెప్పగలను. దాంతోనే మేము చాలా కాలం తర్వాత విండీస్‌ గడ్డపై సిరీస్‌ గెలిచాం" అని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తమీమ్‌ తెలిపాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 6 వికెట్లకు 301 పరుగులు

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 6 వికెట్లకు 301 పరుగులు

బసెటెరె వేదికగా జరిగిన మూడో వన్డేలో తమీమ్‌ ఇక్బాల్‌ (103), మహ్మదుల్లా (67 నాటౌట్‌) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 301 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులే చేయగలిగింది. గేల్‌ (73), హోప్‌ (64) రాణించారు.

ఆఫ్రిది సిక్సర్ల రికార్డును సమం చేసిన గేల్‌

ఆఫ్రిది సిక్సర్ల రికార్డును సమం చేసిన గేల్‌

తొమ్మిదేళ్ల తర్వాత వెస్టిండీస్‌ గడ్డపై బంగ్లాదేశ్‌‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో గేల్‌(73; 66 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఐదో సిక్సర్‌ను సాధిండం ద్వారా క్రిస్ గేల్‌ తన కెరీర్‌లో 476వ సిక్సర్‌ను నమోదు చేశాడు. దీంతో ఆఫ్రిది(476 సిక్సర్లు) సిక్సర్ల రికార్డును గేల్‌ సమం చేశాడు.

Story first published: Monday, July 30, 2018, 14:23 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X