న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. నా మీద నాకే సిగ్గేసింది'

Tamim Iqbal said Used to be ashamed of myself seeing Virat Kohli go about his fitness training

ఢాకా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. తన మీద తనకే సిగ్గేసిందని బంగ్లాదేశ్ సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తెలిపాడు. కోహ్లీది తనది ఒకే వయస్సు అయినప్పుడు.. అతనిలా తాను ఎందుకు ఫిట్‌గా ఉండలేకపోతున్నానని అనుకొనే వాడినని తమీమ్ వెల్లడించాడు. బంగ్లా జట్టు మునుపటిలా లేదని, ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించే స్థాయికి తాము చేరామని చెప్పాడు. ఇక్బాల్ బంగ్లా తరఫున 60 టెస్టులు, 207 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన ఇంగ్లండ్ బోర్డు!!టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన ఇంగ్లండ్ బోర్డు!!

నా మీద నాకే సిగ్గేసింది:

నా మీద నాకే సిగ్గేసింది:

భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ... 'ఇది నేను ఒక భారత కామెంటేటర్‌తో మాట్లాడుతున్నా అని చెప్పడం లేదు. భారత్ మా పక్క దేశం. భారత్‌ ప్రభావం కచ్చితంగా బంగ్లాదేశ్‌పై ఉంటుంది. భారత్‌లో ఫిట్‌నెస్ ప్రక్రియ మారినప్పుడు.. అది మా దేశంపై కూడా ప్రభావం చూపింది. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు. రెండు-మూడేళ్ల విరాట్ కోహ్లీ పరిగెత్తడం చూశాను. అప్పుడు నా మీద నాకే సిగ్గేసింది. అతను నా వయస్సు వాడే.. కానీ ఎంతో ట్రైనింగ్ తీసుకున్నాడు. నేను అందులో సగం కూడా చేయలేదు' అని తమీమ్ చెప్పాడు.

గెలవడం పక్కనుంచితే:

గెలవడం పక్కనుంచితే:

బంగ్లా జట్టు మునుపటిలా లేదని, ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించే స్థాయికి తాము చేరామని తమీమ్ అన్నాడు. 'ఐదారేళ్ల క్రితం పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే మైదానంలోకి వెళ్లే సమయానికే మ్యాచ్ ఫలితం ఖరారైపోయేది. మేం గెలవడం పక్కనుంచితే.. ఏ మాత్రం పోటీ ఇస్తామో అనే అందరూ చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంత పెద్ద జట్టు ఉన్నా గెలవగలమన్న నమ్మకం మా జట్టుకు ఉంది. డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఆటగాడూ మ్యాచ్‌లో గెలవాలనే తపనతోనే ఉంటున్నాడు. ఇది మాలో వచ్చిన అతి పెద్ద మార్పు' అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.

ప్రతి మ్యాచ్‌ను గెలవగలమన్న నమ్మకం ఉంది:

ప్రతి మ్యాచ్‌ను గెలవగలమన్న నమ్మకం ఉంది:

2019 ప్రపంచకప్‌లో తమ జట్టు 8వ స్థానంలో నిలిచినప్పటికీ.. గ్రూప్ దశలో వెస్టిండీస్‌ వంటి భారీ జట్టుపై గెలిచామన్నాడు. న్యూజీలాండ్‌ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా అంచుల వరకూ వెళ్లామని తమిమ్ చెప్పుకొచ్చాడు. ఇకముందు మరింత మెరుగ్గా రాణించగలమని, ప్రతి మ్యాచ్‌ను గెలిచేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం తమకుందని తమిమ్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పిల్లకూనగా అడుగుపెట్టి ఇప్పుడు పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయికి ఎదిగింది బంగ్లాదేశ్. ఎప్పుడో ఒకసారి గెలిచి సంచలనం సృష్టించడం తప్ప వరుస విజయాలు మాత్రం ఆ జట్టుకు ఏనాడూ లేవు. అయితే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ జట్టు పటిష్ఠంగా తయారవుతోంది.

బంగ్లాదేశ్‌ తరపున ప్రపంచ రికార్డు:

బంగ్లాదేశ్‌ తరపున ప్రపంచ రికార్డు:

తమీమ్‌ ఇక్బాల్‌ బంగ్లాదేశ్‌ తరపున ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. తమీమ్ 136 బంతుల్లో 158 పరుగులు చేసి బంగ్లా తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో తమీమ్ 132 పరుగులు చేసాడు. ఇప్పటివరకు ముష్ఫికర్‌ రహీమ్‌ చేసిన 144 పరుగులే అత్యధికం. ఇమ్రుల్ కాయెస్ (144), షకీబ్ అల్ హసన్ (132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డే ఫార్మాట్‌లో 7,000 పరుగులు సాధించిన తొలి బంగ్లా క్రికెటర్‌గా తమీమ్ రికార్డులోకి ఎక్కాడు. ప్రస్తుతం తమీమ్‌ ఖాతాలో 7,202 పరుగులు ఉన్నాయి.

Story first published: Tuesday, June 2, 2020, 21:31 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X