న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: టీమిండియా కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా!

T20 World Cup 2022: David Miller, Aiden Markram slam 50s as SouthAfrica hand India their first defeat

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.

మిల్లర్ కిల్లర్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.

చెలరేగిన అర్ష్‌దీప్

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ సూపర్ బౌలింగ్‌కు సౌతాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అతను వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి క్వింటన్ డికాక్ స్లిప్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. మూడో బంతికి రిలీ రోసౌ(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌటివ్వగా.. దినేశ్ కార్తీక్ సూచనలతో రోహిత్ శర్మ రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు. ఆ తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో 3 వికెట్లకు 24 పరుగులే చేసింది.

చెత్త ఫీల్డింగ్..

ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవడంతో సౌతాఫ్రికా 10 ఓవర్లలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ జోడీని విడదీసే అవకాశాలు వచ్చినా భారత్ చెత్త ఫీల్డింగ్‌తో చేజార్చుకుంది. మూడు రనౌట్లు.. రెండు క్యాచ్‌లు నేలపాలు చేశారు. రోహిత్ శర్మ రెండు సునాయస రనౌట్లు మిస్ చేయగా.. సూర్య ఒక రనౌట్ అవకాశాన్ని చేజార్చాడు. ఇక విరాట్ కోహ్లీ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయగా.. మరో క్యాచ్‌ను హార్దిక్-కోహ్లీ సమన్వయలోపంతో వదిలేశారు. ఈ అవకాశాలను అందుకున్న మార్క్‌రమ్-మిల్లర్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఎయిడెన్ మార్క్‌రమ్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మలుపుతిప్పిన రెండు సిక్స్‌లు..

ఇక హార్దిక్ వేసిన 16వ ఓవర్‌లో మార్క్‌రమ్ క్యాచ్ ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో భారత శిభిరంలో ఆశలు రేగయి. రోహిత్ సైతం వికెట్ తీయాలనే లక్ష్యంతోనే అర్హదీప్ సింగ్‌కు 17వ ఓవర్ ఇచ్చాడు. కానీ ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. అయితే అశ్విన్ వేసిన 18వ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను సౌతాఫ్రికావైపు తిప్పాడు. కానీ అశ్విన్ ట్రిస్టన్ స్టబ్స్(6) ఔట్ చేసి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. చివరి 12 బంతుల్లో సౌతాఫ్రికాకు 12 పరుగులు అవసరమవ్వగా.. షమీ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మిగతా ఐదు బంతులను షమీ కట్టుదిట్టంగా వేయడంతో.. ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికా విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిని డాట్ చేసిన భువీ.. రెండో బంతికి సింగిల్ తీయగా.. మిల్లర్ స్ల్రైక్‌లోకి వచ్చాడు. కానీ మూడో బంతిని మిల్లర్ బౌండరీ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత బంతిని బౌండరీ బాది మిల్లర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Sunday, October 30, 2022, 20:22 [IST]
Other articles published on Oct 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X