న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఐదుగురి ఆటను చూడలేమా?

ICC T20 World Cup 2020:5 Players Who May Not Be Part of Team India Squad For Next Twenty20 World Cup
T20 World Cup 2020: MS Dhoni to Dinesh Karthik, 5 Indian Players Who May Not Be Part of Team India

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్ ముగియడంతో ఇప్పుడు జట్లన్నీ వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై దృష్టి సారించాయి. ఈ వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం టీ20 వరల్డ్‌కప్‌నైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కోహ్లీసేన ఉంది.

దీంతో జట్టు ఎంపికపై సెలక్టర్లు ఇప్పటి నుంచే కసరత్తలు మొదలుపెట్టారు. ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న ధోని, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ లాంటి క్రికెటర్లకు ఈ టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కడం కష్టంగానే ఉంది. యువ క్రికెటర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టులో ఎంపిక కాని ఐదుగురు క్రికెటర్లను ఒక్కసారి చూద్దాం...

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించగానే ధోని రిటైర్మెంట్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఈ వార్తలపై ధోని ఇప్పటివరకు స్పందిచంలేదు. అలాంటిది వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌ వరకు జట్టులో ఉంటాడా లేదా అనేది చెప్పలేం. అంతేకాదు వచ్చే ఏడాది అక్టోబర్‌లో వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ధోని 39వ పడిలోకి అడుగుపెడతాడు.

విజయ్ శంకర్

విజయ్ శంకర్

నాలుగో స్థానంలో ఆల్ రౌండర్‌గా వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపికైన విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అంతేకాదు విజయ్ శంకర్‌ కేవలం వన్డే, టెస్టు క్రికెట్‌కు సరిపోతాడనే భావన కూడా సెలక్టర్లలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు విజయ్ శంకర్ ఎంపికవుతాడని అనుకోవడం తప్పవుతుంది. విజయ్ శంకర్ బ్యాటింగ్ యావరేజి వన్డే, టెస్టు క్రికెట్‌కు సరిపోతుంది. టీ20ల్లో బ్యాటింగ్ యావరేజి చాలా ఎక్కువగా ఉండాలి. ఐపీఎల్ 2019లో సైతం విజయ్ శంకర్ పెద్దగా ఆడిన దాఖలా లేదు.

దినేశ్ కార్తీక్

దినేశ్ కార్తీక్

ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అతి కష్టం మీద తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ధోని తర్వాత అత్యంత సీనియర్ వికెట్ కీపర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో దినేశ్ కార్తీక్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇక, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేయడం కూడా దినేశ్ కార్తీక్ అవకాశాలను దెబ్బతీస్తోంది.

కేదార్ జాదవ్

కేదార్ జాదవ్

మిడిలార్డర్‌లో మంచి బ్యాట్స్‌మన్ అని పేరు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌లో కేదార్ జాదవ్‌కు చోటు దక్కడం కష్టమే. కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన కేదార్ జాదవ్ తరుచూ గాయాల బారిన పడుతుండటం కూడా ఓ సమస్యే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌కు కేదార్ జాదవ్‌ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

అజ్యింకె రహానే

అజ్యింకె రహానే

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఎంపిక కాలేదు. అలాంటిది వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌కు ఎంపికవుతాడా? అంటే కష్టమేనని చెప్పాలి. అయితే, ఐపీఎల్‌లో మాత్రం రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించాడు. అంతేకాదు ఆ జట్టు తరుపున సెంచరీ నమోదు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా తరుపున ఎంపిక కాలేకపోతున్నాడు. టెస్టుల్లో మాత్రం వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, July 16, 2019, 19:30 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X